health tips: నూడిల్స్, బర్గర్లు, పిజ్జాలు బాగా తింటున్నారా? అయితే ఈ అనారోగ్యసమస్యలు పక్కా!!

ఇళ్లల్లో మంచి పోషకాలని ఇచ్చే ధాన్యాలతో, పప్పులతో ఆహారపదార్థాలు వండి పెట్టినా తినకుండా కొత్తకొత్త ఆహారపు అలవాట్లతో ప్రస్తుతం యువత ఆరోగ్యాన్ని డేంజర్ జోన్ లోకి నెట్టుకుంటున్నారు. నూడిల్స్, బర్గర్లు, పిజ్జాలు తింటూ అదేదో గొప్ప ఆహారం గా ఫీల్ అవుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఇంట్లో ఇడ్లీ, దోసె, వడ వంటివి చేస్తున్నా వాటిని తినకుండా పొద్దుపొద్దున్నే నూడిల్స్ చేసుకుని తినే మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఇక అటువంటి వారంతా వారు తింటున్న ఆహారం గురించి కచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిందే.

జంక్ ఫుడ్ కు అడిక్ట్ అవుతున్న యువత

జంక్ ఫుడ్ కు అడిక్ట్ అవుతున్న యువత

ప్రస్తుత సమాజంలో ఆహార అలవాట్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఎక్కువగా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లలో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడానికి యువత ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా చైనీస్ వంటకాలకు అలవాటు పడిన యువత జంక్ ఫుడ్ కు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అయితే ఈ జంక్ ఫుడ్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇంట్లో తయారుచేసిన పోషకాహారాన్ని పక్కనపెట్టి, జంక్ ఫుడ్ తినేవారిలో పోషకాహార లోపం తలెత్తుతుందని చెబుతున్నారు. పోషకాహార లోపం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరిస్తున్నారు.

 జంక్ ఫుడ్ తినటం వల్ల ఒబేసిటీ,చర్మ సమస్యలు, గుండె జబ్బులు

జంక్ ఫుడ్ తినటం వల్ల ఒబేసిటీ,చర్మ సమస్యలు, గుండె జబ్బులు

జంక్ ఫుడ్ తినేవారిలో శరీరంలో కొవ్వు అధికంగా చేరి అది రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచుతుందని, రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ పెరిగితే అది అనేకరకాలుగా ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని చెప్తున్నారు. దాని వలన గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్ తినేవారిలో ఊబకాయం, అజీర్తి, డయాబెటిస్ సమస్యలు వచ్చే అవకాశముందని చెబుతున్నారు.

 డిప్రెషన్ కు కారణంగా జంక్ ఫుడ్

డిప్రెషన్ కు కారణంగా జంక్ ఫుడ్

అంతేకాదు జంక్ ఫుడ్ తీసుకునే వారు మానసిక సమస్యలైన డిప్రెషన్ వంటి వాటితో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక చిన్నారుల్లోనూ జంక్ ఫుడ్ ప్రభావంవల్ల చిన్న వయసులోనే ఒబేసిటీ బారినపడి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు. ఎక్కువగా జంక్ ఫుడ్ తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, చిన్నవయసులోనే మృత్యువాత పడేలా బయటకు కనిపించని అనారోగ్యాలు వారిని ఇబ్బంది పెడతాయని హెచ్చరిస్తున్నారు.

జంక్ ఫుడ్ వ్యసనంగా.. లైఫ్ స్టైల్ వ్యాధులకు కారణంగా..

జంక్ ఫుడ్ వ్యసనంగా.. లైఫ్ స్టైల్ వ్యాధులకు కారణంగా..

జంక్ ఫుడ్ కు బానిసలైతే దాని నుండి బయట పడలేమని, ఆల్కహాల్, డ్రగ్స్ ఏవిధంగా అయితే వ్యసనంగా మారుతాయో అదేవిధంగా జంక్ ఫుడ్ కూడా వ్యసనంగా మారుతుంది అని చెబుతున్నారు. జంక్ ఫుడ్స్ ఏమాత్రం ఆరోగ్యాన్ని ఇవ్వవు అనే విషయాన్ని గుర్తించి రక రకాల అనారోగ్యాలకు కారణమై లైఫ్ స్టైల్ డిసీజెస్ బారిన పడేలా చేసే జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నప్పటి నుండే పిల్లలను జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. లేదంటే వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నట్టే అని హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+