vastu tips: దీపావళి పండుగనాడు ఈ పనులు అస్సలు చెయ్యకండి.. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాకండి!!
హిందువులంతా అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ. దీపావళి పండుగ అంటేనే బంధుమిత్రులతో, మిఠాయిలు పంచుకుంటూ, ఇల్లంతా దీప కాంతులతో వెలుగులు నింపుతూ, బాణాసంచా జిలుగులతో సంబరంగా జరుపుకునే పండుగ. లక్ష్మీదేవిని, వినాయకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే పండుగ. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని ఎంతగా పూజిస్తే, అంత ఆ తల్లి కటాక్షం మనపైన ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. అటువంటి దీపావళి పండుగకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్ప, ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే కొన్ని నియమాలను పాటించాలని చెబుతున్నారు. ఇక ఆ నియమాల విషయానికి వస్తే

దీపావళికి ఇంట్లోని బ్రహ్మ స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోండి
దీపావళి పండుగకు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే బ్రహ్మ స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. బ్రహ్మ స్థలం అంటే ఇంటి మధ్యలో ఉండే ప్రదేశం. దీనిని సూర్య స్థానం అని కూడా అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో మనం ఎక్కువగా ఉండే హాల్ బ్రహ్మ స్థలం గా పరిగణించబడుతుంది. దీనిని ఖచ్చితంగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది ఆశుభ్రంగా ఉంటే లక్ష్మీ దేవికి ఆగ్రహం వస్తుంది. ఇక హాల్లో ఎక్కడ పనిచేయని గడియారాలను, విరిగిపోయిన ఫర్నిచర్ ను, పగిలిపోయిన అద్దాలను ఉంచుకోకుండా చూసుకోవాలి.

దీపావళి బట్టల విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి
దీపావళి పండుగకు అందరూ కొత్త బట్టలు ధరిస్తారు. అయితే బట్టల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీపావళి పండుగ నాడు ధరించే బట్టలలో నలుపు రంగు దుస్తులు లేకుండా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. నలుపు రంగు బట్టలు చాలా శుభ కార్యాలకు, ఎవరికైనా బట్టలు పెట్టటానికి కూడా ఆశుభంగా పరిగణిస్తారు. నలుపు అశాంతిని, నిరాశ ను సూచిస్తుంది. కాబట్టి దీపావళి పండుగ నాడు వేసుకునే దుస్తులలో నలుపు రంగు దుస్తులు అస్సలు వేసుకోకూడదు.

దీపావళి ముగ్గులు వేస్తున్నారా.. ఈ పొరపాట్లు చేయకండి
ఇక దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో ముగ్గులు వేసుకోవడం ఆనవాయితీ గా భావిస్తారు. అలా వేసుకునే ముగ్గులు బియ్యం పిండితో వేసుకుంటే మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో ముగ్గులు వేసే రంగుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీపావళి పండుగ నాడు ముగ్గులు వేసినప్పుడు ఆ ముగ్గులో పొరపాటున కూడా నలుపు రంగును, డార్క్ బ్రౌన్ కలర్ ను ఉపయోగించకూడదని చెబుతున్నారు.

బంధువులకు బహుమానాలు ఇచ్చే విషయంలో ఇవి అస్సలు ఇవ్వకండి
దీపావళి పండుగకు చాలామంది బంధుమిత్రులకు అనేక బహుమానాలను ఇస్తూ ఉంటారు. దీపావళి కి ఇచ్చే బహుమతుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ఎప్పుడూ దీపావళి కి గిఫ్ట్ గా ఇచ్చే బహుమానాల విషయంలో పొరపాటున కూడా లెదర్ వస్తువులను ఇవ్వకూడదని సూచిస్తున్నారు. ఒకవేళ అలా చేస్తే అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ధన నష్టం జరుగుతుందని సూచిస్తున్నారు.

దీపావళి పండుగ నాడు ఈ మూడు చర్యలకు దూరంగా ఉండండి
ఇక దీపావళి పండుగ నాడు మనసును లక్ష్మీదేవి లగ్నం చేసి లక్ష్మి పూజ చేసుకోవాలి తప్ప, పండుగ రోజు ఇతరులను తిట్టడం, గొడవలు పెట్టుకోవడం చేయకూడదని చెబుతున్నారు. దీపావళి పండుగ నాడు ఇతరులను తిట్టడం, కోపంగా మాట్లాడడం, ఏడవడం వంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని, ఆమె కటాక్షం సదరు కుటుంబసభ్యులపై ఉండదని చెబుతున్నారు. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే దీపావళి పండుగ మనకు శుభాలను చేకూరుస్తుందని, ఐశ్వర్యం సిద్ధించేలా చేస్తుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications