Khiladi lady: ఇంటి ఓనర్ కు సీక్రేట్ ఫోటోలు పంపించింది, జస్ట్ రూ. 15 లక్షలు, నిద్రమాత్రల ఎఫెక్ట్ !
బెంగళూరు: శ్రీమంతుల ఇంటిలో ఓ మహిళ చాలా నమ్మకంగా ఆరు సంవత్సరాలు ఇంటి పని చేసింది. కరోనా కాలంలో కూడా ఆమె పనికి తక్కువ రోజులు వచ్చినా ఇంటి యజమాని ఆమెకు జీతం ఇచ్చాడు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఇంటి యజమానులు ఆ పనిమనిషిని పనిలో నుంచి తీసేశారు. తరువాత కూడా నాకు మీ ఇంటిలో పని చెయ్యడానికి అవకాశం ఇవ్వండి అని ఆమె ఇంటి యజమానికి చెప్పింది. అయితే అప్పటికే వేరే మహిళను అతను పనిలో పెట్టుకున్నాడు. రెండు నెలల తరువాత ఇంటి యజమానికి అతని ఇంటిలో ఇంటి పని చేస్తూ పని వదిలేసిన మహిళ కొన్ని ఫోటోలు పంపించింది. అంతే ఆ ఫోటోలు చూసిన ఇంటి యజమాని బిత్తరపోయాడు. ఇంటి పని చేసే మహిళను సీక్రేట్ గా కలిసిన ఇంటి యజమాని ఆమెకు రూ. 1. 20 లక్షలు ఇచ్చి నీ మొబైల్ ఫోన్ లో ఉన్న ఫోటోలు డిలీట్ చెయ్యాలని చెప్పాడు. వారం రోజుల తరువాత మాజీ ఇంటి యజమానికి ఫోన్ చేసిన లేడీ నాకు అర్జెంట్ గా రూ. 10 లక్షలు, 20 రోజుల తరువాత మరో రూ. 5 లక్షలు ఇవ్వకుంటే నా దగ్గర ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ఇంటి యజమాని బిత్తరపోయాడు. ఇంట్లో పని చేస్తున్న కిలాడీలేడీ విషయంలో నిర్లక్షంగా ఉన్న ఇంటి యజమాని ఇప్పుడు లబోదిబో అంటున్నాడు.

ఐటీ హబ్ బెంగళూరులో ?
ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని రామమూర్తి నగర్ లో రంజిత్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రామమూర్తి నగర్ లోనే నివాసం ఉంటున్న సోనియా (30) అనే కిలాడీ లేడీ రంజిత్ కు పరిచయం అయ్యింది. ఇంటి సమీపంలోనే సోనియా కూడా నివాసం ఉండటంతో తన ఇంటిలో ఇంటి పని చెయ్యాలని రంజిత్ ఆమెకు చెప్పాడు.

చాలా నమ్మకంగా పని చేసింది
శ్రీమంతులైన రంజిత్ ఇంటిలో సోనియా చాలా నమ్మకంగా ఆరు సంవత్సరాల నుంచి ఇంటి పని చేసింది. కరోనా కాలంలో కూడా సోనియా పనికి తక్కువ రోజులు వచ్చినా ఇంటి యజమాని రంజిత్ ఆమెకు జీతం ఇచ్చాడు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఇంటి యజమానులు సోనియాను ఇంటి పనిలో నుంచి తీసేశారు. కరోనా వచ్చిందని, తగ్గిపోయిన తరువాత మళ్లీ ఆ ఇంటిలో పనికి చేరవచ్చని సోనియా అనుకుంది.

మొబైల్ లో ఫోటోలు చూసి బిత్తరపోయిన యజమాని
మూడు నెలల క్రితం సోనియా రంజిత్ ఇంటికి వెళ్లింది. నాకు మీ ఇంటిలో పని చెయ్యడానికి అవకాశం ఇవ్వండి అని సోనియా ఇంటి యజమాని రంజిత్ కు చెప్పింది. అయితే అప్పటికే రంజిత్ అతని ఇంట్లో వేరే మహిళను పనిలో పెట్టుకున్నాడు. రెండు నెలల తరువాత ఇంటి యజమాని రంజిత్ కు అతని ఇంట్లో ఇంటి పని చేస్తూ పని వదిలేసిన సోనియా కొన్ని ఫోటోలు పంపించింది. అంతే సోనియా పంపించిన ఫోటోలు చూసిన ఇంటి యజమాని రంజిత్ బిత్తరపోయాడు.

రూ. 1. 20 లక్షలు స్వాహా
ఇంటి పని చేసే ఇప్పుడు వదిలేసిన సోనియాను రామమూర్తి నగర్ సమీపంలో సీక్రేట్ గా కలిసిన ఇంటి యజమాని రంజిత్ ఎందుకు ఇలా చేశావు అని ఆమెను నిలదీశాడు. తరువాత ఇద్దరి మద్య చాలా కథ నడించింది. చివరికి రంజిత్ రూ. 1. 20 లక్షలు సోనియాకు ఇచ్చి నీ మొబైల్ ఫోన్ లో ఉన్న ఫోటోలు డిలీట్ చెయ్యాలని మనవి చేశాడు. నా మొబైల్ లోని ఫోటోలు డిలీట్ చేస్తానని చెప్పిన సోనియా డబ్బులు తీసుకుని వెళ్లిపోయింది.

రూ. 15 లక్షలు డిమాండ్ చేసిన కిలాడీ లేడీ
వారం రోజుల తరువాత మాజీ ఇంటి యజమాని రంజిత్ కు ఫోన్ చేసిన కిలాడీ లేడీ సోనియా నాకు అర్జెంట్ గా రూ. 10 లక్షలు, 20 రోజుల తరువాత మరో రూ. 5 లక్షలు ఇవ్వకుంటే నా దగ్గర ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చెయ్యడంతో మొదలు పెట్టడంతో ఇంటి యజమాని రంజిత్ బిత్తరపోయాడు.

నిద్రమాత్రల ఎఫెక్ట్ తో ఇలా జరిగింది
ఇంట్లో పని చేస్తున్న కిలాడీలేడీ సోనియా విషయంలో నిర్లక్షంగా ఉన్నానని ఇప్పుడు ఆమె నన్ను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపిస్తూ రంజిత్ రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్ లో సోనియా మీద కేసు పెట్టాడు. తాను అనారోగ్యంతో బాదపడుతున్నానని, ప్రతిరోజూ నిద్రమాత్రలు వేసుకుంటున్నానని, నిద్ర మాత్రలు తిన్న తరువాత తన బెడ్ రూమ్ లో తాను అర్థనగ్నంగా ఉన్న సమయంలో సోనియా ఫోటోలు తీసి ఇప్పుడు తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని రంజిత్ పోలీసు కేసు పెట్టాడు.

కిలాడీ లేడీ అరెస్టు
రంజిత్ ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు కిలాడీ లేడీ సోనియాను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో నమ్మకంగా పని చేసి వారి జీతం తీసుకుని ఇప్పుడు వాళ్లనే బ్లాక్ మెయిల్ చేస్తోందని కేసు నమోదు చేసి సోనియాను విచారణ చేస్తున్నామని రామమూర్తినగర పోలీసులు తెలిపారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications