వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బస్సు లోయలో పడి 5 గురి మృతి
నిజమాబాద్: షిర్డీ నుంచి విజయవాడ వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని మధ్కేడ్ వద్ద లోయలో పడడడంతో 5 గురు మరణించారు. మరణించిన వారందరూ ఆంధ్రాకు చెందినవారే. మరో ముగ్గురి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. గాయపడిన వారిని నిజామాబాద్ ఆస్ప్రత్రిలో చేర్పించారు. షిర్డీ యాత్రకు వెళ్ళి వస్తున్న ఈ బస్సులో 36 మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు.
విజయవాడ వస్తున్న ఈ బస్సు మధ్కడ్ వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది. అక్కడికక్కడే ఐదుగురు మరణించారు. శీలం గోవిందరెడ్డి, రఘునాథ వెంకటేశులు, రఘునాథ సరోజా రామారావు, వెంకటేశులు నారయణన్, శ్రీమతి రాజేశ్వరి లు మరణించిన వారిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందరూ 50 ఏళ్ళకు పైబడినవారే.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!