మేము లేకపోతే మీరెవరో: ట్రంప్ ఇంట్లో ట్రంప్ పైనే సెటైర్లు
కింగ్ ఛార్లస్.. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోన్నారు. రెండు రోజుల పర్యటన కోసం క్వీన్ కెమెల్లాతో కలిసి ఇప్పటికే రాజధాని వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. వైట్ హౌస్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. వారిని సాదరంగా ఆహ్వానించారు. కింగ్ ఛార్లెస్ గౌరవార్థం.. డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాటు చేశారు. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి ఈ విందు ఏర్పాటైంది.
ఇందులో కింగ్ ఛార్లెస్ మాట్లాడారు. సరదా వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ వారు లేకపోతే అమెరికన్లు ఫ్రెంచ్ మాట్లాడాల్సి వస్తుందని సెటైర్లు వేశారు. అమెరికన్లకు ఇంగ్లీష్ ఎప్పటికీ వచ్చి ఉండేది కాదనే విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. బ్రిటీషర్ల నుంచే అమెరికన్లు ఇంగ్లీష్ నేర్చుకున్నారని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనికి బదులుగా ఫ్రెంచ్ భాషను మాట్లాడే పరిస్థితి వచ్చి ఉండేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ కు కౌంటర్ ఇచ్చినట్టే.

రక్షణ విషయంలో రెండవ ప్రపంచ యుద్ధం నుండి యూరోపియన్ మిత్రదేశాలు ఫ్రీలోడింగ్ చేస్తున్నాయని డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలను కింగ్ ఛార్లెస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు కూడా. "మిస్టర్ ప్రెసిడెంట్.." అని నేరుగా డొనాల్డ్ ట్రంప్ ను సంబోధిస్తూ ఈ వ్యాఖ్యలుె చేశారు. "అమెరికా లేకపోతే యూరోపియన్ దేశాలు జర్మన్ మాట్లాడాల్సి వస్తుందని మీరు ఇటీవల వ్యాఖ్యానించారు. మేం (బ్రిటీషర్లు) లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడాల్సి వస్తుందని నేను ధైర్యంగా చెప్పగలను.." అని కింగ్ ఛార్లెస్ సరదాగా వ్యాఖ్యానించారు.
జనవరిలో దావోస్ సమ్మిట్‌లో ట్రంప్ మాట్లాడుతూ రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా సహాయం లేకపోతే యూరోపియన్ మిత్ర దేశాలు జర్మన్, జపనీస్ మాట్లాడేవారని చెప్పారు. దానిపై ఎత్తిపొడుపులు పొడిచారు కింగ్ ఛార్లెస్. ఉత్తర అమెరికాలోని బ్రిటిష్, ఫ్రెంచ్ మూలాలున్న ప్రాంతాలను ప్రస్తావించారు. అమెరికా స్వాతంత్ర్యం పొంది 250 సంవత్సరాల క్రితం, కాలనీల నియంత్రణ కోసం బ్రిటీష్, ఫ్రెంచ్ వలసవాదులు ఉత్తర అమెరికా ఖండంలో తీవ్రంగా పోరాడారని గుర్తుచేశారు.
A lot of jokes from King Charles tonight.
— Acyn (@Acyn) April 29, 2026
“You recently commented, Mr. President, that if it were not for the United States, European countries would be speaking German. Dare I say that if it wasn't for us, you'd be speaking French” pic.twitter.com/9EyxNMLxCR
వైట్‌హౌస్ ఈస్ట్ వింగ్‌లో చేసిన కొన్ని పునర్నిర్మాణాల గురించి కూడా మాట్లాడారు కింగ్. ఓ భారీ బాల్‌రూమ్ నిర్మాణం కోసం ఈస్ట్ వింగ్‌ను కూల్చివేసిన విషయాన్ని ప్రస్తావించారు. 1814లో బ్రిటిష్ సైనికులు వైట్‌హౌస్‌కు నిప్పుపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో వైట్‌హౌస్ రియల్ ఎస్టేట్ పునరుద్ధరణకు ప్రయత్నించామని, ఆ చర్యలు చేపట్టినందుకు ఇప్పుడు క్షమించండి.. అని నవ్వుతూ చురకలు అంటించారు. 1773లో వలసవాదులు పన్ను విధించిన బ్రిటిష్ టీని సముద్రంలో పడేసిన బోస్టన్ టీ పార్టీ సంఘటన కంటే ఈ డిన్నర్ చాలా బాగుందని కింగ్ చార్లెస్ చమత్కరించారు.












Click it and Unblock the Notifications