రైతు భరోసా మూడో విడత నిధుల జమ ఆ రోజే, ఈ సారి వీరికి అమలు..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా మూడో విడత నిధుల జమ పైన బిగ్ అప్డేట్ ఇచ్చింది. రైతు భరోసా కోసం వేచి చూస్తున్న రైతులకు నిధుల జమ పైన తాజాగా నిర్ణయం వెల్లడించింది. మూడో విడత నిధుల జమకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ సారి నిధులు అర్హత ఉన్న వారందరికీ జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
రైతు భరోసా పెండింగ్ నిధుల జమ పైన ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ సారి రైతు భరోసా నిధులను ప్రభుత్వం మూడు విడతలుగా జమ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తొలి విడత కింద లబ్దిదారులకు రూ.3,446 కోట్లు, రెండో విడత కింద రూ.2,206 కోట్లు జమ చేసింది. తొలి విడతలో 68,89 లక్షల మందికి లబ్ది చేకూరగా.. రెండో విడతలో 45.11 లక్షల మంది రైతులకు అందించింది. కాగా.. మూడో విడత నిధులను లబ్ది దారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. మే తొలి వారంలోనే ఈ నిధులను జమ చేయనుంది. ఈ మేరకు ఆర్దిక శాఖ తుది కసరత్తు చేస్తోంది. నిధులను ప్రభుత్వం సేకరించే పనిలో నిమగ్నమైంది. రూ.12 వేల కోట్లు సమీకరించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐ కు ఇండెంట్ ఇచ్చింది. ఈ నిధులతో రైతు భరోసా తో పాటుగా ఉద్యోగుల పెండింగ్ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రూ 12 వేల రుణం 6 నుంచి 25 ఏళ్లల్లో చెల్లించనుందని తెలుస్తోంది. 7 నుంచి 7.5 శాతం వడ్డీకే వీటిని తీసుకోనుందని సమాచారం.

ఆర్దిక శాఖ కసరత్తు
అదే విధంగా అలాగే హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకునేందుకు హైదరాబాద్ మెట్రోపాలిట న్ డెవలప్‌మెంట్ అధారిటీ ద్వారా నిధుల సమీకరణకు సిద్దమయ్యారు. రూ.15 వేల కోట్లు మెట్రో స్వాధీనానికి అవసరమవుతాయి. దీంతో రానున్న రెండు నెలల్లో రైతు భరోసా, మెట్రో స్వాధీనం, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం రూ.12 వేల కోట్లు సమీకరించేందుకు రెడీ అయింది. కాగా, రైతు భరోసా నిధుల విడుదలలో భాగంగా తొలి విడతగా ఎకరం భూమికి రూ.6 వేల చొప్పున అందించారు. ఆ తర్వాత రెండో విడత కింద మరికొంత భూమికి జమ చేయగా.. మూడో విడతలో మొత్తం భూమికి అందించనుంది. ఇక రైతు భరోసా డబ్బులు పడనివారు బ్యాంక్ కేవైసీ పూర్తి చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్‌కు ప్రతీ ఏడాది కేవైసీ పూర్తి చేయాలి. అప్పుడే బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సొమ్ము డీబీటీ ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది.













Click it and Unblock the Notifications