బెంగాల్ లో బీజేపీకి వచ్చే సీట్లు ఇన్నే

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు ఆరంభమైంది. మొత్తం 142 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి దశలో 152 నియోజకవర్గాల్లో 92.72 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో పోలింగ్ జరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. పలు నియోజకవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ పోరు నెలకొంది. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చగల సత్తా ఉన్న కీలక నియోజకవర్గాలు, అభ్యర్థులు బరిలో ఉన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిత్రా ఇన్‌స్టిట్యూట్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. పార్టీ విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. 2021 నాటి ఎన్నికల కంటే కూడా ఇప్పుడు వచ్చే సీట్ల సంఖ్య మరింత పెరుగుతుందని ధీమాగా చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అశాంతియుత వాతావరణం నెలకొంటుందనే భయం ఓటర్లల్లో ఉందని వ్యాఖ్యానించారు.

Abhishek Banerjee Vows TMC Victory as BJP on Track for Sub-50 Seats Says Track Record Speaks

ఈ ఎన్నికల్లో బీజేపీకి 50 కంటే తక్కువ సీట్లు దక్కుతాయని అభిషేక్ బెనర్జీ జోస్యం చెప్పారు. పశ్చిమ బెెంగాల్ ను క్లీన్ స్వీప్ చేస్తామని 2021 ఎన్నికల్లో కూడా బీజేపీ నాయకులు చెప్పుకొన్నారని, ఆ తర్వాతి పరిస్థితి ఏమిటో వాళ్లకే తెలుసునని అన్నారు. అప్పట్లో వారికి ఎన్ని సీట్లు వచ్చాయో వెళ్లి వారినే అడగండని సెటైర్లు వేశారు. బీజేపీకి తిరుగులేని విజయం అని ప్రతిసారి చెబుతుంటారని, అలా చెప్పినప్పుడల్లా ఫలితాలు తమకు అనుకూలంగానే వచ్చాయని అన్నారు.

2021లో తమకు 200 సీట్లు వస్తాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పిన విషయాన్ని అభిషేక్ బెనర్జీ పరోక్షంగా గుర్తు చేశారు. అయినప్పటికీ తృణమూల్ 200 సీట్లు దాటింది. లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో 30 సీట్లు వస్తాయని బీజేపీ చెప్పగా తాము 29 సీట్లు గెలిచామని ఆయన చెప్పారు. ఇప్పుడు 177 సీట్లు వస్తాయని బీజేపీ నాయకులు చెబుతున్నారని, ఈ ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే, బీజేపీకి 50కి లోపే సీట్లు వస్తాయని పేర్కొన్నారు.

ఎన్నికల పరిశీలకులు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలు, హ్యాండ్‌బుక్ నిబంధనలను బీజేపీ నియమించిన ఎన్నికల అబ్జర్వర్లు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీజేపీ ఎత్తుగడలేవీ పనిచేయబోవని, భారీ మెజారిటీతో తాము తిరిగి అధికారంలోకి వస్తామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+