తమిళుల్ని మోసగించిన చంద్రబాబుః జయ
చెన్నై: చెన్నైకి తెలుగుగంగ నీళ్లు తరలించటం ఒట్టి బూటకమని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ఆమెఅసెంబ్లీలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ను చెన్నై మేయర్‌ను చేసేందుకు కరుణానిధి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కలిసి ఈ నాటకమాడారని ఆమె దుమ్మెత్తిపోశారు. చెన్నైకు తెలుగుగంగ నీరందిస్తున్నామంటూ నాటకమాడి, కొడుకు చెన్నై మేయర్‌అయిన తరువాత ఆ విషయం గాలికొదిలేశారని, ప్రజలకు నీరందలేదని ఆమెవివరించారు.
వాన నీటిని తెలుగుగంగ నీరుగా నమ్మంచి కాలువ ప్రారంభోత్సవం చేశారని, ఆ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడాహాజరు కావడం తమిళ ప్రజలను మోసం చేయడమేనని జయలలితవిమర్శించారు. తెలుగు గంగపై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి చర్చిస్తానని ఆమె చెప్పారు.
చెన్నైకు తెలుగుగంగ నీరు విడుదల చేస్తున్నామంటూ ఒక సభకూడా ఏర్పాటు చేశారని, ఆ సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడాహాజరయ్యారని ఆమె పేర్కొన్నారు. కాబట్టి ఈ విషయంలో చంద్రబాబును కూడా అనుమానించాల్సి వస్తోందని జయలలిత అన్నారు. తన కొడుకును చెన్నై నగరమేయర్‌ను చేసుకునేందుకు కరుణానిధి ఈ నాటకంతో ఆయన నైజం బైటపడిందని జయలలిత అన్నారు.
తెలుగుగంగ నిర్మాణానికి కనీసం భూమిని కూడా పూర్తి స్థాయిలోసేకరించని ఆంధ్ర ప్రభుత్వం చెన్నయ్ కి కృష్ణా జలాలలను ఎలా తరలిస్తుందని ఆమెఅసెంబ్లీలో ప్రశ్నించారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించడం తన అభిమతం కాదంటూనే జయలలిత చాలా తెలివిగా చంద్రబాబునువిమర్శించారు. తెలుగుగంగ కాలువ వచ్చిందంటూ బూటకపు ప్రారంభోత్సవం చేశారని, ఆ కార్యక్రమానికి చంద్రబాబు కూడాహాజరయ్యారని ఆమె అన్నారు. అందుకే తెలుగుగంగ కాలువవిషయంలో చంద్రబాబును కూడా అనుమానించాల్సి వస్తుందని జయ అన్నారు.












Click it and Unblock the Notifications
