కలిసివుంటే కలదు సుఖంః ఎమ్మెస్సార్
విశాఖపట్నంః రానున్న పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఒక్కతాటిపై నడవాలని పిసిసి నేత ఎం. సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. కార్యకర్తల మధ్య విబేధాలు సృష్టించే నాయకులను తరిమికొట్టాలని ఆయన కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఎమ్మెస్సార్ శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ కాంగ్రెస్ నేతలు ఎమ్మెస్సార్ కు బ్రహ్మరథం పట్టారు. భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించి ఆయనను ఘనంగా సన్మానించారు.
కాంగ్రెస్ జాతీయ ప్రచార కార్యదర్శి టి. సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెస్సార్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో కలిసికట్టుగా వుంటే తెలుగుదేశం పార్టీని ఓడించవచ్చునని అన్నారు. కొందరు స్వార్థపరులైన నేతలు కార్యకర్తల్లో చిచ్చు పెడుతున్నారని, వారిపట్ల అప్రమత్తంగా వుండాలని ఆయన హెచ్చరించారు. ఆ తరువాత ఎమ్మెస్సార్ శ్రీకాకుళంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
