ఒరాకిల్‌నుంచి 9ఐ డిబి సాఫ్ట్‌వేర్‌

న్యూఢిల్లీ:ఒరాకిల్‌ కార్పొరేషన్‌ శుక్రవారం నాడు ఓ కొత్త డేటాబేస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించింది. కంపెనీలు తక్కువ వ్యయంతో సులభమైన రీతిలో ఇంటర్‌నెట్‌నువినియోగించుకోవడానికి ఈ సాఫ్ట్‌వేర్‌ తొడ్పడుతుంది.

ఒరాకిల్‌ 9ఐ పేరుతో మార్కెట్‌లోకి తెచ్చిన ఈ కొత్త డేటాబేస్‌ను ఇంగ్లీష్‌తో పాటు పది భారతీయ భాషల్లో దీనిని వినియోగించుకోవచ్చు. ఒరాకిల్‌ చైర్మన్‌ సిఇవో లారెన్స్‌ జె ఎల్లిసన్‌ కాలీఫోర్నియాలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ డేటాబేస్‌ వినియోగదారులకు 400 రకాల కొత్త ఫీచర్లను ఆఫర్‌ చేస్తున్నది. ఈ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన లాంగ్వేజ్‌ ఇంటర్‌ఫేస్‌ను బెంగుళూరులోని ఒరాకిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ డెవలప్‌చేసింది.

ఈ సాఫ్ట్‌వేర్‌ విక్రయాల కోసం కార్పొరేట్‌లతో పాటు మధ్య స్థాయి వ్యాపారాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై దృష్టి కేంద్రీకరించాలని ఒరాకిల్‌ నిర్ణయించింది. ఐటీ కార్యకలాపాల కోసం కేటాయించిన పెట్టుబడిలో 3 శాతం ఇ-గవర్నెన్స్‌ కోసం ఖర్చు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన నేపధ్యంలో ఇండియాలో ఈ సాఫ్ట్‌వేర్‌కు గిరాకీ బాగా వుంటుందని ఒరకిల్‌ భావిస్తున్నది.

విఎస్‌ఎన్‌ఎల్‌కు ఆల్కాటెల్‌ నెట్‌వర్క్‌

ఐటిలో 11 లక్షల ఉద్యోగాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+