ఐటిలో 11 లక్షల ఉద్యోగాలు
విజయవాడ: ఐటి ఆధారిత సర్వీసుల రంగంలో రానున్న ఎనిమిదేళ్ల కాలంలో అమెరికాలోనే 14000 కోట్ల డాలర్ల వ్యాపారానికి అవకాశం వుంది. ఈ మొత్తంలో భారత్‌గట్టిగా కృషి చేస్తే 1700 కోట్ల డాలర్ల వ్యాపారన్ని భారత్ సాధించవచ్చని హైదరాబాద్ ఎస్‌టిపిఐ డైరెక్టర్ కల్నల్ విజయకుమార్ చెప్పారు.
కనీసం 11 లక్షల కొత్త ఉద్యోగావకాశలను ఐటి రంగం కల్పిస్తుందని ఆయన అన్నారు. సిఐఐ విజయవాడలో ఐటి ఆధారిత సర్వీసులపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. బాక్ ఆఫీస్ ఆపరేషన్స్, అకౌంటింగ్, బీమా, బ్యాంకింగ్, హోటల్ పరిశ్రమ, టెలీమెడిసన్‌తో సహా వేరువేరు కంప్యూటర్ అప్లికేషన్స్ రంగంలో అనేక అవకాశాలు వున్నాయని ఆయన చెప్పారు. అమెరికాలో ఏర్పడిన మాంద్యం వల్ల భారత్‌కు ఒకవిధంగా లాభమే తప్ప నష్టం లేదని ఆయన అన్నారు. విజయవాడ వంటి పట్టణాల్లో ఐటి ఆధారిత
సర్వీసులకు మంచి అవకాశాలు వున్నాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications