అమెరికాలో 9 లక్షల ఐటి ఉద్యోగాలు
న్యూయార్క్‌ః ఐటి రంగంలో మాంద్యం ఉన్నప్పటికీ అమెరికాలో ఇప్పటికీ ఐటి నిపుణులకు డిమాండ్ ఉందని ప్రముఖపరిశోధన సంస్ధ సర్వేలో తేలింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది 9 లక్షల మంది ఐటినిపుణులను ఉద్యోగాల్లో చేర్చుకోవాలని అమెరికన్ సంస్దలు యోచిస్తున్నాయి. ఇందులో నాలుగున్నర లక్షల ఉద్యోగాలు తగిన టెక్నికల్, నాన్‌టెక్నికల్ నైపుణ్యం ఉన్న అభ్యర్ధుల కొరత కారణంగా భర్తీ కాకపోచ్చని ఈ సంస్ధ తేల్చి చెప్పింది.
అమెరికాలో ఇప్పటికే కోటి మందికి పైగా ఐటి ఉద్యోగులు ఉన్నారు. డాట్ కాం బిజినెస్ చిక్కుల్లో పడినంత మాత్రాన ఉద్యోగార్ధులు నిరాశా దృక్పథంతో ఉండనవసరం లేదని ఈ సంస్ధ అభిప్రాయపడింది.. ఈ సంస్ధ గత ఏడాది కూడా ఇదే విధమైనసర్వే నిర్వహించింది. 16 లక్షల ఐటీ ఉద్యోగుల అవసరం ఉంటుందని, ఇందులో 8,50,000 ఉద్యోగాలు తగిన నైపుణ్యం గల ఉద్యోగులు లేని కారణంగా భర్తీ కావని ఈ సంస్ధఅంచనా వేసింది. ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా తమ నైపుణ్యాలకు ఎప్పటికప్పుడు పదునుపెట్టుకోవాలని ఈ సంస్ధ సూచించింది.
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ కమ్యూనిటీ కాలేజెస్, అమెరికన్ మేనేజ్ మెంట్ సిస్టమ్స్, సిస్కో సిస్టమ్స్,హాల్ కినియన్, ఇంటెల్, ఐటిటి ఎడ్యుకేషనల్‌సర్వీసెస్, నాలెడ్జి వర్కర్స్, మైక్రోసాఫ్ట్, ఎస్ ఆర్ ఎ ఇంటర్నేషనల్ తదితర సంస్ధలు ఈసర్వేను స్పాన్సర్ చేశాయి. యాభైకి పైగా సిబ్బంది ఉన్న కంపెనీలన్నిటినీ ఈసర్వేలో చేర్చారు. మొత్తం 191 ఐటి సంస్ధలు, 494 నాన్ ఐటి సంస్ధలుసర్వేలో పాల్గొన్నాయి.
అమెరికాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఇప్పటికీ అగ్రగామిగా ఉందని, ఏడు శాతం ఉద్యోగులు ఈ రంగంలో ఉన్నారని ఐటీఎఎఅంచనా వేసింది. ఐటీ కంపెనీల యాజమాన్యాలు కొత్త ఉద్యోగులనుఅసలు తీసుకోవద్దనుకోవడం లేదని, కొత్త రిక్రూట్ మెంట్‌విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయని ఈ సంస్ధవివరించింది. 2000 సంవత్సరంతో పోల్చితే ఐటి ఉద్యోగులకున్న డిమాండ్ 44 శాతం తగ్గిందని, అంత మాత్రం చేత ఉద్యోగావకాశాలుఅసలే లేవని భావించరాదని తెలిపింది. ఐటి ఉద్యోగుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంటుందనిపేర్కొంది.












Click it and Unblock the Notifications