భారతి భారీ కాల్‌సెంటర్
న్యూఢిల్లీ: భారతి టెలీ టెక్ ప్రమోట్ చేసిన భారతి ఇన్‌ఫ్రా గుర్‌గావ్‌లోని ఇన్పోసిటీలో 1000 సీట్ల కాల్‌సెంటర్‌ను ప్రారంభిస్తున్నది. ఈ ఇన్ఫోసిటీని యూనిటెక్, హర్యానా అర్బన్‌డెవలప్‌మెంట్ అథార్టీ, సింగపూర్‌కు చెందిన కన్సార్షియం జాయింట్‌గా ప్రమోట్ చేసిన గుర్‌గావ్ టెక్నాలజీ పార్క్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్నది.
ఇన్ఫోసిటీలో భారతి సంస్థ ఇప్పటికే మూడెకరాల స్థలం కొనుగోలు చేసింది. మొదట ఈ సెంటర్‌లో వాయిస్‌మెయిల్ బిజినెస్‌ను ప్రారంభించాలని ఆ తర్వాత క్రమంగా ఇ-మెయిల్, డేటా
బేస్డ్, వెబ్ బేస్డ్ లావాదేవీలను కూడా నిర్వహించాలని భారతి నిర్ణయించింది. గుర్‌గావ్ కేంద్రాన్ని అక్కడ నిర్వహించే కార్యకలాపాల ప్రత్యేకత దృష్ట్యా కాల్‌సెంటర్ అని కాకుండా కాంటాక్ట్ సెంటర్ అని వ్యవహరిస్తారు. ఈ కాంటాక్ట్ సెంటర్ రెండేళ్లలో ప్రారంభమవుతుంది. కాగా హైదరాబాద్, పూణ, ముంబాయి, బెంగుళూరుల్లో త్వరలోనే తాము కాల్‌సెంటర్స్‌ను కూడా ప్రారంభిస్తున్నట్టుగా భారతి వర్గాలు చెప్పాయి.












Click it and Unblock the Notifications