దేశం మా ప్రధాన శత్రవు: టిసిఎల్‌ఎఫ్
హైదరాబాద్ : స్ధానిక సంస్ధల ఎన్నికలలో తెలంగాణాలో తెలుగుదేశాన్ని మట్టి కరిపించేందుకు తాము టిఆర్‌ఎస్‌తో నైనా పొత్తుపెట్టుకుంటామని తెలంగాణా కాంగ్రెస్ శాసనసభ్యుల ఫోరం (టిసిఎల్‌ఎఫ్) నేత పాల్వాయి గోవర్ధనరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయటమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణాకు తెలుగుదేశం పార్టీ ఎనలేని ద్రోహం చేసిందని ఆయన దుయ్యబట్టారు. ప్రత్యేక తెలంగాణాకు కాంగ్రెస్ అధిష్టానం తప్పకఅంగీకరిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తాము కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిసి ప్రత్యేక తెలంగాణా ఆవశ్యకతను వివరించినపుడు ఆమె సానుకూలంగా స్పందించారని గోవర్ధనరెడ్డిపేర్కొన్నారు. జులై2వ తేదీలోగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని చిన్నరాష్టాల ఏర్పాటు అధ్యయన కమిటీ తెలంగాణావిషయమై చర్చించేందుకు తమను ఈ నెల 30 తేదీన ఢిల్లీకి ఆహ్వానించిందని ఆయన తెలిపారు.
స్ధానిక సంస్ధల ఎన్నికలలో తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా చేయటమేఏకైకలక్ష్యంగా తాము పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు. స్ధానిక సంస్ధల ఎన్నికలలో ప్రత్యేక తెలంగాణా ఒక్కటే ప్రధానాంశం కాదని పాల్వాయి అన్నారు.












Click it and Unblock the Notifications