మరో 90 మందితోదేశం జాబితాలు
హైదరాబాద్: పంచాయతీరాజ్ ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థులమరో రెండు జాబితాలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు మంగళవారం విడుదలచేశారు. మంగళవారంనాడు 90 మంది జడ్‌పిటిసి అభ్యర్థుల జాబితాలనుఆయన విడుదల చేశారు. ఇప్పటి వరకు నాలుగు విడతలుగా 177మంది అభ్యర్థులను తెలుగుదేశం పార్టీప్రకటించింది.
వెనుకబడిన తరగుతులఅభువృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వంఎంతో కృషి చేసిందని, ఈ కృషే తెలుగుదేశం పార్టీని ఈఎన్నికల్లో గెలిపిస్తుందని చంద్రబాబునాయుడుఅన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను వ్యాపరంగా మార్చిందని,అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు.కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదనిఆయన అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీగానిబంధనలను మరింత సడలించనున్నట్లుఆయన తెలిపారు. మరో రెండేళ్లలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి భారీగా నిధులు ఖర్చు చేస్తామనిఆయన అన్నారు.
జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల మూడో జాబితాను మంగళవారం నాడు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేశారు. ఈ జాబితాలో 43 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. ఆ తర్వాత అభ్యర్ధులతో ఎన్‌టిఆర్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేయించారు.
మూడో జాబితాలో మహిళలకు పెద్దపీట వేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బిజెపితో పొత్తు కుదుర్చుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ సోమవారం నాడు 87 మంది అభ్యర్ధులతో రెండు జాబితాలను విడుదల చేసిన విషయం విదితమే. బిజెపితో ఏకాభిప్రాయం కుదిరిన మండలాలు, జెడ్‌పిటిసి స్థానాలకు అభ్యర్ధుల జాబితాలను తెలుగుదేశం ప్రకటిస్తున్నది.
కాగా ఎన్నికల తర్వాత స్వర్ణాంధ్ర సాధన దిశలో మండలస్థాయిలో అభివృద్ధి ప్రణాళికలను రచించి అమలు చేయాల్సిన అవసరం వున్నదని చంద్రబాబు చెప్పారు. గ్రామాల అభివృద్ధికి జెడ్‌పిటిసిలు బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధికి పట్టం కట్టే ప్రజలు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘనవిజయం చేకూర్చడం ఖాయమని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications