మైనార్టీలకు బిజెపి బుజ్జగింపు
న్యూఢిల్లీ; దేశవ్యాప్తంగా వున్న మైనార్టీలు బిజెపిలో చేరాలని బిజెపి అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో మైనార్టీల ప్రగతిని కాంగ్రెస్ ఇంతకాలం అడ్డుకుంటూ వచ్చిందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో బిజెపి మైనార్టీ సెల్ రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన బుధవారం నాడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ కారణంగానే మైనార్టీలు బిజెపికి దూరమయ్యారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ దుష్ప్రచారం వల్ల బిజెపిని మైనార్టీలు సందేహించారని ఆయన అన్నారు. అయితే గత ఆయిదు దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో వున్నందుకు ఆపార్టీ తమకు చేసిందేమీ లేదన్న విషయం మైనార్టీలు ఇప్పుడు గ్రహించారని జనా చెప్పారు. కాంగ్రెస్‌ను దూరం కొట్టి బిజెపికి మద్దతు నివ్వడం మైనార్టీల ప్రగతికి దొహదం చేస్తుందని ఆయన చెప్పారు. కాగా యుపి ఎన్నికల నేపథ్యంలో మైనార్టీల ఓట్లకోసం బిజెపిపడుతున్న పాట్లకు ఈ సదస్సు అద్దంపడుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.












Click it and Unblock the Notifications