సర్కారు చేతిలోనేస్థానికఅధికారాలు
హైదరాబాద్: స్థానిక సంస్థలకు అధికారాలు, విధులు, బాధ్యతలను వేటినీ రాష్ట్ర ప్రభుత్వం బదలాయించడం లేదని సిపిఎం ఆరోపించింది. రానున్న ప్రాదేశీక నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి పార్టీ గురువారం నాడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఈ ఎన్నికల ప్రణాళికలో స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు 16 అంశాలను పొందుపర్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానిక సంస్థల నేతల చేతుల్లో వుండాల్సిన అధికారాలను మంత్రులు, నోడల్ అధికారులు తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారని పార్టీ నేత రాఘవులు దుయ్యబట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఏకగ్రీవ ఎన్నికలు ప్రహసనంగా మారాయని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications