ఉద్యోగాల్లో ఐబిఎం కోత
ముంబాయి: గ్లోబల్ సర్వీసెస్ గ్రూప్‌లో వెయ్యి మంది ఉద్యోగులను తొలిగించాలని ఐబిఎం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం ప్రభావం ఇండియాలోని తమ సబ్సిడరీపై వుండదని అంటున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఇండియాను ఐబిఎం వ్యూహాత్మకమైన మార్కెట్‌గా పరిగణిస్తున్నదని ఇండియాలో మూకుమ్మడిగా ఉద్యోగాల్లోంచి తొలిగించడం వుండదని ఐబిఎం మేనేజ్‌మెంట్ వర్గాలు చెప్పాయి.
గ్లోబల్ సర్వీసెస్ డివిజన్ నుంచి తొలిగించి ఉద్యోగులకు కూడా ఐబిఎం ఇతర డివిజన్లలో అవకాశం కల్పిస్తారని వారు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ డివిజన్‌లో లక్షా యాభై వేల మంది పనిచేస్తున్నారని అయితే మాంద్యం వల్ల ఈ డివిజన్‌కు గిరాకీ తగ్గడంతో తాము లేఆఫ్ నిర్ణయం తీసుకున్నామని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications