అల్పపీడనం-కోస్తాలో భారీ వర్షాలు
హైదరాబాద్‌ః బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా ఉత్తరకోస్తా జిల్లాలలో గురువారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాతో పాటు కోస్తా జిల్లాలలో కూడా రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు కురుస్తాని వాతావణశాఖ తెలిపింది. గురువారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ లో సైతం భారీ వర్షం కురిసింది. వర్షాకాలం వచ్చినప్పటికీ ఇంత వరకు మంచి వర్ష కురవలేదు. కొద్ది రోజుల కిందట తుపాను ప్రభావంతో నాలుగురోజులు ముసురుపట్టింది. మళ్ళీ అల్పపీడనం పుణ్యమా అంటూ భాగ్యనగర ప్రజలు కాస్త సేదతీరారు.












Click it and Unblock the Notifications