సర్కారు బళ్లలో టాటాల ఐటి పాఠాలు

హైదరాబాద్‌: ఐటి శిక్షణ, విద్యారంగంలోని టాటాఇన్పోటెక్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐటి విద్యను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తున్నది. ప్రభుత్వం అనుమతిస్తే రెండు నెలల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ కోర్సులను ప్రవేశపెడతారు.

కోర్సులో చేరిన ప్రతి విద్యార్ధి నుంచి ప్రతినెలా 80 రూపాయలు వసూలు చేస్తారు. ఆరో తరగతి స్థాయి విద్యార్ధుల నుంచి ఈ ఐటి కోర్సులను ప్రారంభిస్తారు. హర్యానాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఈ కోర్సులను టాటా ఇన్ఫోటెక్‌ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాలను కూడా సంప్రదిస్తున్నట్టు టాటా ఇన్పో అధికారులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+