రైతులకు రక్షణ కల్పించాలి
హైదరాబాద్: గ్లోబలైజేషన్ దరిమిలా భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కుంటున్న సవాళ్లనుంచి రైతులకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయంపై ఏర్పాటుచేసిన కేంద్రటాస్క్‌ఫోర్స్ అభిప్రాయపడింది.
శరద్‌జోషి ఆధ్వర్యంలోనిటాస్క్‌ఫోర్స్ సమావేశం శుక్రవారం నాడు హైదరాబాద్‌లో జరిగింది. దేశంలోని వ్యవసాయదారులు అంతర్జాతీయ పోటీని తట్టుకోవడానికి సన్నద్ధం కావాలని సమావేశం పిలుపు నిచ్చింది. అదే సమయంలోరైతాంగం దిగుమతుల కారణంగా దెబ్బతినకుండా ఆహార ధాన్యాల దిగుమతులపై సుంకాలను గణనీయంగాపెంచాలని సదస్సులో మాట్లాడిన రాష్ట్ర మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సూచించారు.
కాగా ప్రభుత్వ చర్యలేరైతాంగం నడ్డి విరుస్తున్నాయని టాస్క్ ఫోర్స్ కన్వీనర్ శరద్‌జోషిఆరోపించారు. ప్రభుత్వాలు దేశీయ రైతాంగం శ్రేయస్సు కన్నా ప్రపంచవాణిజ్య సంస్థ ఒప్పందాలకు ఎక్కువగావిలువనిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications