రంగారెడ్డి జడ్పీ దేశంపరం!

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ నేతలస్వయంకృతం వల్ల చేతులదాకా వచ్చిన ప్రతిష్టాత్మకమైన రంగారెడ్డి జడ్పీ చైర్మన్‌ పదవి తెలుగుదేశం పార్టీ పరమయ్యే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌ అగ్రనేతల వైఖరితోవిసిగిపోయిన కందుకూరు జడ్‌పిటిసి సభ్యుడు సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేయడంతో జిల్లా జడ్‌పి రాజకీయం అనూహ్యమైన మలుపు తిరిగింది.

33 మంది సభ్యులున్న జిల్లా పరిషత్‌లో తెలుగుదేశం-బిజెపి కూటమికి కేవలం 16 స్థానాలు లభించాయి. కాగా కాంగ్రెస్‌కు 15, టిఆర్‌ఎస్‌, సిపిఎం పార్టీలకు ఒక్కోస్థానం చొప్పున లభించాయి. టిఆర్‌ఎస్‌, సిపిఎం సభ్యుల మద్దతుతో అలవోకగా జెడ్‌పి చైర్మన్‌ పదవిని చేజిక్కించుకోవడం ఖాయమని జిల్లా కాంగ్రెస్‌ నేతలు గట్టిగా నమ్మారు.

అయితే చైర్మన్‌ పదవికోసం కమతం రామిరెడ్డి కుమారుడు శ్రీనివాసు రెడ్డికి సబితారెడ్డి గ్రూప్‌నకు మధ్య ప్రారంభమయిన పోరాటంతో జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాలు నాలుగురోజుల్లోనే అనేక మలుపులు తిరిగాయి.ఒకవైపు మొయినాబాద్‌ జడ్‌పిటిసి సభ్యుడు కంజర్ల భాస్కర్‌ను తెలుగుదేశం వర్గాలు కిడ్నాప్‌ చేశాయని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ ధర్నా జరుపుతుండగా మరో వైపు తననెవ్వరూ కిడ్నాప్‌ చేయలేదని తాను కాంగ్రెస్‌కు ఓటు వేయదల్చుకోలేదని భాస్కర్‌పేరుతో ప్రకటనలు వెలువడుతున్నాయి.

మరో వైపు చైర్మన్‌ పదవిని ఆశించి భంగపడిన శంషాబాద్‌ జెడ్‌పిటిసి సభ్యుడు సత్యనారాయణయాదవ్‌ సైతం తాను ఓటింగ్‌లో పాల్గొనడం లేదని ప్రకటన చేశారు. కందుకూరు సత్యనారాయణ ఏకంగా రాజీనామానే చేశారు. ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్‌ బలం 15 నుంచి 12కు పడిపోయిందనిఅందువల్ల ఎన్నితిప్పలు పడినా చైర్మన్‌ పదవిని దక్కించుకోవడం ఆ పార్టీకి సాధ్యం కాదనిఅంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+