ఆంధ్రలో టెలీమెడిసిన్‌పైలెట్ ప్రాజెక్టు
హైదరాబాద్‌ః ఐటి అభివృద్ధఇలో అగ్రగామిగా వున్న ఆంధ్రప్రదేశ్ అప్లికేషన్ విషయం లో కూడా ముందంజలో వుంది. ప్రప్రథంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెలీమెడిసిన్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నది. ప్రైవేట్‌రంగంలోని రెండు బడా ఆస్పత్రులు కేర్ ఫౌండేషన్, అపోలో ఆస్పత్రి సహకారంతో నాలుగుజిల్లాల్లో టెలీమెడిసిన్ ద్వారా గ్రామీణ ప్రాంత రోగులకు వైద్య సహాయం అందించేందుకు నిర్ణయించారు.
ప్రభుత్వ వైద్య శాఖ కూడా తనవంతుగా ఎపిటిఎస్ సహాయంతో మరో రెండు జిల్లాల్లో టెలీమెడిసిన్‌ను ప్రవేశపెడుతున్నది. ఏడాది క్రితం అపోలో ఆస్పత్రి చిత్తూరు జిల్లా అరగొండలో ప్రవేశపెట్టిన టెలీమెడిసిన ప్రాజెక్టు విజయవంతం కావడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. టెలీమెడిసిన్ ద్వార అత్యాధునికి వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల రోగులకు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెచ్చే వీలుంటుంది. ప్రస్తుతం ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కరీంనగర్ పట్టణాల్లో అపోలో ఆస్పత్రి టెలీమెడిసిన్ సర్వీసును ప్రవేశపెడుతుంది. కేర్ ఫౌండేషన్ నెల్లూరు, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఆస్పత్రులను ఎంపిక చేసింది. కాగా ప్రభుత్వ వైద్య విభాగం ఖమ్మం, సంగారెడ్డి పట్టణాల్లో ఇదే తరహా సర్వీసులను ప్రవేశపెట్టే సన్నాహాల్లో వుంది.
ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా టెలీమెడిసిన్ ద్వారా వైద్య సేవలను అందించడానికి అవసరమైన స్కానింగ్ పరికరాలు, కలర్ డప్లర్, ఇసిజి, ఎక్స్‌రే, సిటి స్కాన్, ఆల్ట్రాసౌండ్ వంటి పరికరాలను ప్రైవేట్ సంస్థలే తాము సర్వీసు అందజేస్తున్న ఆస్పత్రిలో అమర్చాల్సివుంటుంది. ఈ స్కీమ్ కింద అపోలో, కేర్ కేవలం డయాగ్నోస్టిక్ సర్వీసులను మాత్రమే అందజేస్తాయి. ట్రీట్‌మెంట్ విషయంలో పేషెంట్‌కు పూర్తి స్వేచ్చ వుంటుంది.












Click it and Unblock the Notifications