కృష్ణాజలాలపై సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ ః కృష్ణాజలాల అదనపు జలాల వినియోగానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన ఒక పిటీషన్‌పై ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వ నేతలు కుమ్మక్కై నిబంధనలకువిరుద్ధంగా కృష్ణా అదనపు జలాల వినియోగానికి ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్టుగా కర్ణాటక ఆరోపించింది. తెలుగుగంగ,శ్రీశైలం ఎడమ కాలువతో సహా మొత్తం అయిదు ప్రాజెక్టులను కృష్ణా అదనపు జలాల వినియోగానికి ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్నట్టుగా కర్ణాటకపేర్కొంది. అదనపు జలాల వినియోగాన్ని ఆ తర్వాత అధికారికంగా తనపరం చేసుకునే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ వున్నట్టుగా కర్ణాటకపేర్కొంది. ఈ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి గడువు కావాలని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకోరాయి.












Click it and Unblock the Notifications