కాంగ్రెస్ మండలాధ్యక్షుడి దారుణ హత్య
అనంతపురం: కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి) ఉపనాయకుడు జె.సి. దివాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలాధ్యక్షుడు బాలసతీష్ కుమార్ (30) ఆదివారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. తెలుగు దేశం పార్టీ మండల నాయకులే ఈ హత్యకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాలసతీష్ తన అనుచరులతో అనంతపురం నుంచి తాడిపత్రి మార్గంలో యాడికి టాటా
సుమోలో వెళ్తుండగా దారి కాచి బుక్కరాయ సముద్రం మండలం రోటరీ పురం గ్రామ సమీపంలో హత్య చేశారు. జీపు అడ్డంపెట్టి ప్రత్యర్థులు సతీష్‌పై దాడి చేశారు. ప్రత్యర్థుల వద్ద మారణాయుధాలు చూసి భయంతో సతీష్ సుమోలోంచి దిగి పారిపోతుండగా ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నడి రోడ్డుమీదే నరికి వచ్చిన వాహనంలోనే పరారయ్యారు. సతీష్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
హత్యచేసినవారిలో ముగ్గురిని గుర్తించామని, వారిలోయాడికి మాజీ మండలాధ్యక్షుడు బాలాజీ చంద్రశేఖర్,కంబగిరి, రాజప్ప, రంగయ్యలతో పాటు మరో పదిమంది ఉన్నట్లు గాయపడిన చిన్న ఈరన్న,మరో ఇద్దరు పోలీసులతో చెప్పారు. తాడిపత్రికాంగ్రెస్ నేత పుల్లరెడ్డి హత్యను మర్చిపోకముందే కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హత్యకుగురి కావడం గమనార్హం.
ఇదిలా వుండగా, బాలసతీష్ కుమార్ హత్యకుప్రతీకారంగా ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచిరాత్రి పొద్దు పోయేవరకు కాంగ్రెస్ కార్యకర్తలుప్రత్యర్థులపై పెద్ద యెత్తున దాడులు చేశారు.తెలుగుదేశం పార్టీకి చెందినవారి లక్షలాదిరూపాయల విలువ చేసే ఆస్తులు బుగ్గిపాలయ్యాయి.దాదాపు 40 ఇళ్లపై దాడులు జరిగినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications