పంద్రాగస్టుకు దేశమంతా రెడ్ అలర్ట్
న్యూఢిల్లీః స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ ఏడాది మున్నెన్నడూ లేని విధంగా అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాద మూకలనుంచి ముప్పు పొంచుకుని విషయమై ఇంటలీజెన్స్ సంస్థల నుంచి గట్టి హెచ్చరికలు రావడంతో దేశంలోని అన్నిప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసు బలగాలను మొహరించారు.
రాజధాని ఢిల్లీలో ఏడు వేలమందిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట వద్దకు కొత్తవారిని రానివ్వడంలేదు.రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్, విమానాశ్రయాల్లోపెద్దఎత్తున నిఘాను పెంచారు. ఎర్రకోట వద్ద బుధవారం ఉదయం జాతీయపతాక ఆవిష్కరణోత్సవం సందర్భంగా హెలికాప్టర్లను కూడా నిఘాకోసం వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా పోలీసులు భారీ ఎత్తున బలగాలను మొహరించాయి.












Click it and Unblock the Notifications