రైలు ప్రమాదాల్లో 20 మంది మృతి
జల్గావ్, పాట్నా: మహారాష్ట్ర,బిహార్‌లలో గురువారం జరిగిన రెండు రైలు ప్రమాదాల్లో 20 మంది మరణించారు. మహారాష్ట్రలోనిజల్గావ్ జిల్లాలో చైన్ లాగి రైలు దిగిపోయినవారిని గీతాంజలిఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో 15 మంది మరణించారు.బిహార్‌లోని దానాపూర్ డివిజన్‌లో ఉన్న జమువాయ్‌రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ప్యాసెంజర్ రైలు, గూడ్స్‌రైలు ఢీకొని ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు.
వార్ధా- బుస్సావల్ ప్యాసెంజర్ రైలులోని ప్రయాణికులు కొందరు బుసావల్-బద్‌నేరా సెక్షన్‌ల మధ్య బోద్‌వాడ్, అచెగావ్‌స్టేషన్‌ల మధ్య చైన్ లాగి దిగి వెళ్తుండగా వారిపై నుండి గీతాంజలిఎక్స్‌ప్రెస్ దూసుకుపోయింది. ఆ ప్రమాదంలో మరణించినవారిలో ఎనిమండుగురు మహిళలు,అయిదుగురు పిల్లలు, మరో ఇద్దరు ఉన్నారు.
బిహార్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 50 మంది గాయపడ్డారు.












Click it and Unblock the Notifications
