టిసిఎస్‌కు జోరుగా గిరాకీ
న్యూఢిల్లీః సాఫ్ట్‌వేర్ సంస్థలన్నీ మాంద్యంలో కొట్టుకుంటుంటే టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ వ్యవహారం మాత్రం ఆరు ప్రాజెక్టులు మూడు రిక్రూట్‌మెంట్లతో జోరుగా సాగుతున్నది. ఏప్రిల్-జూన్ మధ్య ఈ సంస్థ కొత్తగా 84 మంది క్లయింట్లను సంపాదించింది.
ఈ కొత్త సంఖ్యతో టిసిఎస్ క్లయింట్ల సంఖ్య రికార్డు సంఖ్య వెయ్యిని తాకింది. క్లయింట్లను పెంచుకోవడంతో పాటు కొత్తగా మూడువేల మందిని టిసిఎస్ రిక్రూట్ చేసుకున్నది. గత అయిదునెలల కాలంలోనే ఈ రిక్రూట్‌మెంట్లు జరగడం విశేషం. సాఫ్ట్‌వేర్ రంగంలోని అనేక కంపెనీలు చేతులెత్తేసి ప్రాజెక్టుల కొరత కారణంగా పింక్ స్లిప్స్‌తో ఉద్యోగులను ఇళ్లకు పంపిస్తుంటే వాటికి భిన్నంగా టిసిఎస్ రిక్రూట్‌మెంట్స్ సాగిస్తుండటం విశేషం. విప్రో, ఇన్ఫోసిస్‌తో పోలిస్తే టిసిఎస్ కొత్త క్లయింట్లను రాబట్టడంలో అగ్రభాగంలో వుంది.












Click it and Unblock the Notifications
