కాషాయీకరణకు బాబు వ్యతిరేకత
హైదరాబాద్‌ః విద్యను కాషాయీకరించే ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తున్నామని తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఏర్పాటు చేసిన సమావేశానికి గైర్హాజరయినంత మాత్రానా తాము విద్య కాషాయీకరణను సమర్ధిస్తున్నట్టు కాదని సోమవారం నాడు ఆయన వివరించారు.
ఎన్‌డిఎ ప్రభుత్వానికి మద్దతునిస్తున్న కారణంగా తామువిద్యపై ఏర్పాటు చేసిన సిఎంల సదస్సుకు హాజరుకాలేదని ఆయన చెప్పారు. గతంలోసరస్వతీ వందనం పాట పాడాలన్నప్పుడు కూడా తమ పార్టీ మంత్రి ప్రతిభాభారతి మొట్టమొదట దీనిని వ్యతిరేకించినవిషయం ఆయన గుర్తుచేశారు. విద్యను కాషాయికరించే ఉద్దేశ్యం తమకు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్న కారణంగా తాము కేంద్రానికి లేఖ రాయడం అనవసరమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
