మహిళాకాంగ్రెస్ నేతగా గీతారెడ్డి
హైదరాబాద్‌ః కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా మాజీ మంత్రి జె గీతారెడ్డి నియమితులయ్యారు. గల్లా అరుణకుమారి రాజీనామా దరిమిలా ఈ పదవి ఖాళీ అయిన విషయం విదితమే.
రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత సోనియాగాంధీ ఈ నియామకం జరిపినట్టుగా గీతారెడ్డికి పంపిన లేఖలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ నేత చంద్రేశ్ కుమారి వెల్లడించారు. వృత్తిరీత్యా డాక్టరైన గీతారెడ్డి గతంలో మెదక్ జిల్లా గజ్వేల్ నుంచిఅసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలు, వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా కూడా పనిచేశారు. 1999 ఎన్నికల్లో గజ్వేల్ నుంచేఅసెంబ్లీకి పోటీ చేసి ఓడి పోయారు.












Click it and Unblock the Notifications
