కరీంనగర్ బాలికల యుద్ధభేరి
కరీంనగర్‌ః కరీంనగర్ లో ఓ గురుకుల పాఠశాలవిద్యార్థినులు సంచలనం సృష్టించారు. హాస్టల్ లో పురుగులు వున్న అన్నం పెట్టడంతో పాటు పాఠశాల ప్రిన్స్ పాల్ వేధింపులు భరించలేని 50 మందివిద్యార్థినులు కరీంనగర్ జాతీయ రహదారిపై ఏకంగా రాస్తారోకోకు దిగారు. జిన్నారం మండలం మందపు గురుకుల పాఠశాలవిద్యార్థినులు హఠాత్తుగా నిరసన భేరి మోగించడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
పురుగులు నిండిన అన్నం,అరకొర వసతులతో పాటు ప్రిన్స్ పాల్ వేధింపులకువిసిగిన చిన్నారి హాస్టల్ విద్యార్థినులు శుక్రవారం ఆగ్రహంతో రాస్తారోకో ప్రారంభించారు. గంటలతరబడి తిండిలేకుండా రోడ్డుపైకూర్చోవడంతో 29 మంది విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోయారు.వీరిని పోలీసులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.విద్యార్థినుల ఆగ్రహభేరితో కదిలిన జిల్లా యంత్రాంగం ఈ వ్యవహారంపైవిచారణకు ఆదేశించింది.
హాస్టల్ కాంట్రాక్టర్ పైన, గురుకుల పాఠశాల ప్రిన్స్ పాలాపైన విచారణ జరపి నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులను కోరినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్రా దావా చెప్పారు. వారి తప్పు వున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. మొత్తంమీద చిన్నారులు అన్యాయంపై ఇలా ఉద్యమం చేపట్టడం జిల్లాలో సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications