మళ్ళీ పవర్ కట్ ప్రారంభం
హైదరాబాద్‌ః విద్యుత్ లభ్యత, డిమాండ్ కు పొంతన కుదరకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు గంటల పాటు విద్యుత్ కోత విధించాలని ట్రాన్స్ కో నిర్ణయించింది. ఇప్పటికే కోత అమల్లోకి వచ్చింది. ఫీడర్ల వారీగా వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేలు సమయాల్లో కరెంట్ కోత విధిస్తున్నారు. వ్యవసాయ అవసరాలకు రోజుకు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.
గృహావసరాలకు కూడావిద్యుత్ వాడకం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లోవిద్యుత్ కోత విధించడం మినహా మార్గం లేదనిట్రాన్స్ కో అంటున్నది. సెప్టెంబర్ నెలలో రోజువారీ డిమాండ్ 145మిలియన్ యూనిట్లకు చేరింది. మరోపైవు విద్యుత్ సరఫరా మందగించింది. దీనితో రాష్ట్ర మంతటా అనధికారికంగావిద్యుత్ కోత విధిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications