దక్షిణాసియా క్రీడల వాయిదా
ఇస్లామాబాద్: వచ్చే నెల ఆరు నుంచి 15వ తేదీ వరకు ఇక్కడ జరగాల్సిన 9వ దక్షిణాసియా ఫెడరేషన్ క్రీడలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈవిషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ఆదివారంనాడు ప్రకటించింది.
అమెరికాలో జరిగిన దాడుల నేపథ్యంలో దక్షిణాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ క్రీడలను వాయిదా వేయాలని సాంకేతిక కమిటీ ప్రతినిధులు చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ క్రీడల మంత్రి ఎస్.కె. ట్రెస్లర్‌విలేకరుల సమావేశంలో చెప్పారు. క్రీడల వాయిదాకు తాముఅయిష్టంగా అంగీకరించామని, పరిస్థితి చక్కబడగానే కొత్త తేదీలను ప్రకటిస్తామని ట్రెస్లర్ చెప్పారు.












Click it and Unblock the Notifications