లాడెన్ అప్పగింతకు తాలిబాన్ నో
ఇస్లామాబాద్: అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్ లాడెన్‌ను అప్పగించేందుకు తాలిబాన్ మరోసారి తిరస్కరించింది. తమ దేశంపై అమెరికా దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని తాలిబాన్ ఆదివారంనాడు హెచ్చరించింది.
అమెరికా డిమాండ్‌ను అంగీకరించడం అఎn్ఘానిస్థాన్ ముస్లింలెవరికీ ఇష్టం లేదని, ఈ డిమాండ్‌ను అంగీకరించడానికి సిద్ధంగా లేరని తాలిబాన్ నేత ముల్లా మహమ్మద్ ఒమర్‌అఎn్ఘాన్ ఇస్లామిక్ ప్రెస్‌తో చెప్పారు.
తమ వైఖరిలో మార్పేమీ లేదని, ఇస్లాం, అఎn్ఘాన్ సంప్రదాయాలవిషయాల్లో రాజీ ప్రసక్తే లేదని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి తాము ఎన్నో ప్రయత్నాలు చేశామని, అయితే అమెరికా యుద్ధానికే సిద్ధపడిందని ఆయన అన్నారు.
తాము అల్లాపై విశ్వాసం ఉంచుతున్నామని, తమ మతంతో సంబంధాలనుదెబ్బ తీసుకోదలుచుకోలేదని ఆయన అన్నారు. అమెరికాకు సాయపడే పొరుగు దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని అధికార ప్రతినిధి హెచ్చరించారు.












Click it and Unblock the Notifications