కరీంనగర్ జడ్‌పిలో గందరగోళం
కరీంనగర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీర్మానాన్ని ప్రతిపాదించడంతో కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో తీవ్ర గందరగోళం చెలరేగింది. కాంగ్రెస్ శాసనసభ్యుడు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించడంవిశేషం. కరవు పరిస్థితులపై కరీంనగర్ జిల్లా పరిషత్ అత్యవసర సమావేశం ఆదివారంనాడు ఏర్పాటయింది. అయితే, ప్రత్యేక తెలంగాణ తీర్మానం ప్రతిపాదనతో చెలరేగిన గందరగోళం వల్ల కరువుపై చర్చ జరగనే లేదు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే తీర్మానాన్ని మంథని శాసనసభ్యుడు డి. శ్రీధర్ బాబు సమావేశంలో ప్రతిపాదించారు. ఈ తీర్మానానికి తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు ఆమోదం తెలుపగా, తెలుగుదేశం, బిజెపి సభ్యులు వ్యతిరేకత ప్రదర్శించారు. దీంతో సమావేశంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఈ గందరగోళంలోనే తీర్మానాన్ని ఆమోదించినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ రాజేశ్వరరావు ప్రకటించారు.
తాము తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నామంటూ అంతకు ముందు శ్రీధర్ బాబు తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానం ప్రతిపాదించే ముందు తమ అభిప్రాయం కూడా తెలుసుకోవలసి వుండిందని తెలుగుదేశం శాసనసభ్యుడు ముద్దసాని దామోదర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ శాసనసభ్యుడు ఈ తీర్మానం ప్రతిపాదించడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications