బంగ్లాదేశ్‌లో ఖలీదా ఘనవిజయం
ఢాకా: బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) ఆధ్వర్యంలోని నాలుగు పార్టీల కూటమి ఘనవిజయం సాధించింది. ఇంత వరకు 282 ఫలితాలను ప్రకటించగా బిఎన్‌పి మూడింట రెండు వంతుల స్థానాలనుకైవసం చేసుకుంది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ఘోర పరాజయాన్ని చవి చూసింది.
మొత్తం 303 స్థానాల్లో 282 స్థానాల ఫలితాలను ప్రకటించగా బిఎన్‌పి కూటమి 202 స్థానాలు గెల్చుకుంది. దాని మిత్రపక్షమైన జమాతే ఇస్లామీకి 16 స్థానాలు దక్కాయి. బిఎన్‌పి ఒక్కటే 186 స్థానాలు గెలుపొందింది. దీంతో ఆ పార్టీకిస్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం చేకూరింది. కాగా అవామీ లీగ్‌కు 61సీట్లే దక్కాయి. మాజీ సైనిక పాలకుడు ఎర్షాద్ ప్రారంభించిన ఇస్లామిక్ జాతీయ ఓకియా జోత్‌కు 12సీట్లు దక్కాయి.












Click it and Unblock the Notifications