వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయిదో రోజు భీకరంగా దాడులు

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః గత అయిదురోజులుగా అఎn్గాన్‌పై నిప్పుల వాన కురిపిస్తున్న అమెరికా వైమానికి దళం గురువారం ఐదవరోజు దాడులను మరింత ఉధృతం చేసింది. పలు పట్టణాలు మరుభూమిగా మారాయి. ఒక గ్రామంలో వందమంది ప్రజలు బాంబు దాడిలో మరణించినట్టుగా తాలిబన్లు ప్రకటించారు. జలాలాబాద్‌లో మసీదు ధ్వంసం అయినట్టుగా చెప్పారు.

గురువారం నాటి దాడులతో ఆస్తినష్టం , ప్రాణనష్టం అపరిమితంగాపెరిగిపోయినట్టుగా అఎn్గాన్‌వర్గాలు ప్రకటించాయి. తాలిబన్లకు చెందిన దాదాపు ప్రధానసైనిక కేంద్రాలు, అల్‌కైదా నెట్‌వర్క్‌ శిబిరాలు నామరూపాల్లేకుండా పోయాయి.పెద్ద సంఖ్యలో అమెరికన్‌ యుద్ధ విమానాలు, బాంబర్లుఅఎn్గాన్‌ గగనతలంలో స్వేచ్ఛగా విహరిస్తూ బాంబుల జడివాన కురిపించాయి.అయిదురోజుల దాడుల్లో గురువారం నాటి దాడులు మరింత తీక్షణంగా వున్నాయి. కాబూల్‌, కాందహార్‌ మట్టిదిబ్బలుగా మారిపోయాయి. బుధవారం రాత్రి ప్రారంభించి రేయింబవళ్లు మహోధృతంగా వచ్చి పడుతున్న బాంబులతోఅఎn్గానిస్తాన్‌ కొండలు దద్దరిల్లుతున్నాయి.

దేశందేశమంతా పునాదులనుంచి కంపిస్తున్నది.కొంపాగోడు వదిలి ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. గురువారం నాడు కనీసం ముఫ్పై భారీవిస్ఫోటనాలు సంభవించినట్టుగా చెబుతున్నారు. ఇదిలా వుండగా పాకిస్తాన్‌లోని జాకొబాబాద్‌విమానాశ్రయంలో అమెరికాకు చెందిన డజన్లకొద్ది యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు లాండయినట్టుగా పాకిస్తాన్‌ వర్గాలు చెప్పాయి. పాకిస్తాన్‌నుంచి కూడా అమెరికా దాడులు ప్రారంభించే అవకాశం వున్నదనిఅంటున్నారు. పెద్ద సంఖ్యలో అమెరికా కమెండో దళాలు కూడా పాకిస్తాన్‌లో అడుగుపెట్టినగా తెలిసింది. ఈవిమానాశ్రయానికి రక్షణ కల్పించేందుకు పెద్ద సంఖ్యలో పాకిస్తాన్‌ తనసైన్యాన్ని మొహరించింది. అమెరికన్‌ బలగాలు పాకిస్తాన్‌లో అడుగుపెట్టినట్టుగా తెలిస్తే ప్రజలనుంచి ప్రతిఘటన మరింత తీవ్రంగా వుండే అవకాశం వుంది. హెలికాప్టర్‌ గన్‌ షిప్స్‌ను కూడా అమెరికా రంగంలోకి దించింది. గురువారం నాడు కొండల్లి సైతం పిండిముద్దలుగా చేసేకేవ్‌ బస్టర్స్‌ను అమెరికా ప్రయోగించినట్టుగా చెప్పుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X