అఎn్ఘాన్‌లో కొనసాగుతున్న దాడులు
కాబూల్:అఎn్ఘాన్ రాజధాని కాబూల్‌పై అమెరికా బుధవారంనాడు కూడా బాంబులు కురిపించింది. బుధవారం ఉదయం ఏడు భారీ బాంబుపేలుళ్లకు అమెరికా పాల్పడింది. కాబూల్ ఆగ్నేయ ప్రాంతంలో అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఈ ప్రాంతంలో తాలిబాన్‌సైన్యం వాడే చారిత్రకమైన ఫోర్ట్ వుంది. మారజాన్ హిల్‌కు సమీపంలో గల ఫోర్టు వద్ద దట్టమైన ధూళి కమ్ముకుంది.
మంగళవారం అర్థరాత్రి కాబూల్‌పై అమెరికా బలగాలు మూడు బాంబులు ప్రయోగించాయి. మంగళవారం పగలు, రాత్రి దాడులు నిర్వహించిన అమెరికా బుధవారం పగలు కూడా కొనసాగిస్తోంది. మంగళవారంనాటి దాడిలో రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ వేర్‌హౌస్ ధ్వంసమైంది.
కాబూల్‌కు ఉత్తరంగా ఉన్న తాలిబాన్ సైనిక ఫ్రంట్ లైన్ పొజిషన్స్‌పై అమెరికా బాంబులు ప్రయోగించింది. కాందహార్‌పై కూడా అమెరికా దాడులు చేసింది. దీంతో నగరంలోపెద్ద యెత్తున మంటలు లేచాయి. కాందహార్ దాదాపుగా నిర్మానుష్యమైంది.












Click it and Unblock the Notifications