కేంద్రమంత్రి బావమరిది కిడ్నాప్
కరీంనగర్‌ః కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిసి.హెచ్. విద్యాసాగర్ రావు బావమరిది మార్తాండ రావును నక్సలైట్లు శుక్రవారం నాడు కిడ్నాప్ చేశారు. దసరా పండుగ జరుపుకొనేందుకు కరీంనగర్ జిల్లా బోయిన్ పల్లి మండలం కోరెం గ్రామానికి వచ్చిన మార్తాండరావును జనశక్తి నక్సలైట్లుగా భావిస్తున్న నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. మార్తాండరావువిద్యాసాగర్ రావు సతీమణి వినోదా దేవి బాబాయి కుమారుడు. కుటుంబ సభ్యులతో గ్రామానికి వెళ్ళిన మార్తాండరావును శుక్రవారం వేకువ జామున నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర మంత్రి గానీ, మార్తాండ రావు కుటుంబ సభ్యులు గానీ ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు ఈఅంశంపై నోరు మందపడం లేదు.
శుక్రవారం వేకువ జామున నలుగురు నక్సలైట్లు వచ్చి మార్తాండరావును తమ వెంట అడవుల్లోకి తీసుకు వెళ్ళారు. దళ నేతమీతో మాట్లాడనుకుంటున్నారని నక్సలైట్లు మార్తాండరావును తీసుకెళ్ళారు. కాంట్రాక్టర్ గా మంచిపేరు తెచ్చుకుంటున్న మార్తాండరావును నక్సలైట్లు డబ్బు కోసం కిడ్నాప్ చేశారని పోలీసులు భావిస్తున్నారు.
కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు కూడా శుక్రవారం నాడు ఆ గ్రామాన్ని సందర్శించాల్సి వుంది. కిడ్నాప్ వార్త తెలియడంతోవిద్యాసాగర్ రావు తన పర్యటనను రద్దు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications