రాష్ట్ర బంద్ కుసర్వం సిద్ధం
హైదరాబాద్‌ః24 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర బంద్ జరగనుంది. ఆర్టీసీ కార్మికులు న్యాయపరమైన డిమాండ్లు తీర్చకుండా మొండికేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు తమ సత్తా చూపాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. సమ్మెను రుంప చేయడం ద్వారా బంద్ ను ఆపాలని ప్రభుత్వం ఓ వైపు ప్రయత్నాలు చేస్తూనే మరో వైపు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా బుధవారం నాడు కూడా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ప్రదర్శనలు జరిగాయి. జయవాడలో ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేశారు. తిరుపతిలో వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. అన్ని జిల్లా కేంద్రాలు నిరసనలతో, ఆర్టీసీ కార్మికుల నినాదాలతో హోరెత్తిపోయాయి.












Click it and Unblock the Notifications