CM విజయ్ ఆన్ డ్యూటీ, రాహుల్ ఎదుటే టార్గెట్ స్టాలిన్ - అంతా డొల్ల.. లెక్కలతో సహా..!!
విజయ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. వెంటనే డ్యూటీ ఎక్కేసారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. తనకు సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు చెబుతూనే.. రాహుల్ సమక్షంలోనే మాజీ సీఎం స్టాలిన్ ను టార్గెట్ చేసారు. తాను ఇచ్చిన హామీలు అమలు చేస్తానని చెబుతూనే.. గత పాలనలోని అంశాలను ప్రస్తావించారు. సీఎంగా మూడు హామీల అమలు పైన సంతకాలు చేసారు. ఆ తరువాత సీఎంగా చేసిన తొలి ప్రసంగంలో ఉద్వేగానికి లోనయ్యారు. కీలక అంశాలను విజయ్ ప్రస్తావించారు. సహకరించాలని కోరారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విజయ్ చేసిన తొలి ప్రసంగంలో మద్దతు ఇచ్చిన పార్టీలతో సఖ్యత.. వైరి పక్షాలతో అమీ తుమీకి సిద్దమనే సంకేతాలు ఇచ్చారు. తనను విమర్శించే వారు రానున్న రోజుల్లో మరింత ఎక్కవగా ఉంటారని చెప్పుకొచ్చారు. వేదిక పైన రాహుల్ ఉండగా గత ప్రభుత్వాల వైఫల్యాలను ప్రస్తావించారు. గత డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి మనపై సుమారు రూ. 10 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపారని లెక్కలు బయట పెట్టారు. తాను అబద్ధపు హామీలు ఇవ్వనని చెప్పారు. ప్రజల సొమ్ము నుంచి ఒక్క పైసా కూడా పక్కదారి పట్టనివ్వను, ఎవరినీ రాష్ట్రాన్ని లూటీ చేయనివ్వనని విజయ్ స్పష్టం చేశారు. పారదర్శకత కోసం త్వరలోనే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై 'శ్వేతపత్రం' విడుదల చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో తాను ఇచ్చిన హామీల్లో మూడు వెంటనే అమలు దిశగా సంతకాలు చేసారు.

డీఎంకే ప్రభుత్వం పై విమర్శలతో
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయ్ ఉద్వేగంతో చేసిన ప్రసంగం వైరల్ అవుతోంది. తన జీవితంలో చాలా కష్టాలు అనుభవించానన్న సీఎం విజయ్.. ఆకలి బాధలు అంటే ఏంటో తనకు తెలుసన్నారు. తనను అభిమానంగా పిలిచారు కాబట్టే రాజకీయాల్లోకి వచ్చానని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. తాను మీ కుటుంబ సభ్యుడి లాంటి వాడినని.. సినిమాల్లో తనను ఉన్నతస్థాయిలో నిలిపారన్నారు. తమ్ముడూ రా.. అంటూ పిలిచారు కాబట్టే రాజకీయాల్లోకి వచ్చానని.. తన ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా నని గుర్తు చేసారు. ఇది మీ ప్రభుత్వం.. డ్రగ్స్‌పై ఈ రోజు నుంచే పోరాటం ప్రారంభమని సీఎం విజయ్ అన్నారు. ఏది సాధ్యమో అది మాత్రమే చేస్తామని.. అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. 'దిస్ ఈజ్ న్యూ బిగినింగ్. ప్రజా ధనాన్ని వృథా చేయను.. దోచుకోను. టీవీకేలో ఒకే ఒక అధికార కేంద్రం ఉంది.. అది విజయ్ మాత్రమే. నేను పవర్ సెంటర్.. మరో పవర్ సెంటర్ ఉండదు.. ఉండబోదని తేల్చి చెప్పారు. దీంతో.. ఇప్పుడు విజయ్ వ్యాఖ్యల పైన స్టాలిన్ స్పందించారు. మిగులు బడ్జెట్ ఉందని చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు తమిళనాడు ఆర్దిక పరిస్థితి.. విజయ్ హామీల అమలు పైన ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications