200 మిలియన్ ఏళ్లుగా మారని మొసలి మాతృత్వం!

మొసలి అనగానే మనకు గుర్తొచ్చేది భయంకరమైన దవడలు, నీటిలో మాటువేసి వేటాడే క్రూరత్వం. కానీ, ఆ కరుకు చర్మం వెనుక, ఆ భయంకరమైన రూపం లోపల ఒక అద్భుతమైన 'అమ్మ' మనసు ఉందని మీకు తెలుసా? మే 10, మదర్స్ డే సందర్భంగా ప్రకృతి మనకు అందిస్తున్న అత్యంత ఆశ్చర్యకరమైన నిజం ఇది. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, జంతు ప్రపంచంలోనే అత్యంత కష్టపడే, రక్షణ కల్పించే తల్లుల జాబితాలో ఉప్పునీటి మొసళ్లు (Saltwater Crocodiles) మొదటి వరుసలో ఉంటాయి.

సాధారణంగా సరీసృపాలు గుడ్లు పెట్టి వదిలేస్తాయని మనందరి నమ్మకం. కానీ మొసలి తల్లి వేరు. ఒకసారి గూడు కట్టి 20 నుంచి 80 వరకు గుడ్లు పెట్టిన తర్వాత, ఆ తల్లికి అసలైన పరీక్ష మొదలవుతుంది. దాదాపు మూడు నెలల పాటు ఆ గుడ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇతర మొసళ్లు, వరదలు, క్రూర జంతువుల నుంచి తన సంతానాన్ని కాపాడుకోవడానికి ఆ తల్లి తిండి, నిద్ర మానేసి మరీ నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది. ఆ సమయంలో ఆమె చూపించే ఓపిక, నిబద్ధత ఏ క్షీరదానికైనా దీటుగా ఉంటుందని పరిశోధకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Mothers Day Special The Surprising Maternal Instincts Of Saltwater Crocodiles And Their Gentle Protection

పిల్లల కేకలు.. తల్లి పలకరింపు

మొసలి పిల్లలు గుడ్ల నుంచి బయటకు రాకముందే తమ తల్లికి సంకేతాలు పంపుతాయి. గుడ్డు లోపల నుండే అవి చేసే 'చిర్పింగ్' శబ్దాలను తల్లి మొసలి ఇట్టే గుర్తుపడుతుంది. ఆ పిలుపు వినబడగానే, తన పదునైన గోళ్లతో గూడును తవ్వి పిల్లలు క్షేమంగా బయటకు రావడానికి దారి చేస్తుంది.

చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ

భయంకరమైన దవడలే.. పసిపిల్లలకు పల్లకీలు!

మొసలి నోరు ఎంత బలమైనదంటే, అది ఏనుగు చర్మాన్ని కూడా చీల్చగలదు. కానీ, తన బిడ్డల దగ్గరకు వచ్చేసరికి అదే నోరు ఒక సున్నితమైన ఊయలగా మారుతుంది. పుట్టిన పసిపిల్లలను తన భారీ దవడలతో అత్యంత జాగ్రత్తగా నోట్లోకి తీసుకుని, సున్నితంగా దగ్గరలోని నీటి వనరుల వద్దకు చేరుస్తుంది. భయంకరమైన ఆ దవడల మధ్య పసి మొసళ్లు అంత సురక్షితంగా ఉండటం ప్రకృతిలో ఒక గొప్ప వింత.

అండగా ఉండే అమ్మ

చాలా జంతువులు పిల్లలు పుట్టగానే వదిలేస్తాయి, కానీ మొసలి తల్లి మాత్రం వారాలు, నెలల పాటు తన పిల్లల వెంటే ఉంటుంది. పక్షులు, చేపలు లేదా పెద్ద బల్లుల నుంచి తన పిల్లలకు ఆపద రాకుండా కాపాడుతుంది. పిల్లలు ఆపదలో ఉండి చేసే కేకలకు ఆ తల్లి వెంటనే స్పందిస్తుంది. ఈ లక్షణం మొసళ్లకు మనం అనుకున్నదానికంటే ఎక్కువ ఆధునిక స్వభావాన్ని కల్పిస్తోంది.

 వామ్మో: ఎనిమిదేళ్ల వేట కొనసాగిన తర్వాత దొరికింది ఈ భారీ మొసలి
వామ్మో: ఎనిమిదేళ్ల వేట కొనసాగిన తర్వాత దొరికింది ఈ భారీ మొసలి

మొసలి రూపం భయానకంగా ఉండవచ్చు, దాని చరిత్ర 200 మిలియన్ ఏళ్ల నాటిది కావచ్చు.. కానీ దాని మాతృత్వపు విలువలు మాత్రం ఎప్పటికీ శాశ్వతం. కవచం లాంటి చర్మం వెనుక ఒక మమతానురాగాలున్న తల్లి ఉంటుందని మొసళ్లు నిరూపిస్తున్నాయి. మదర్స్ డే వేళ, మాతృత్వం అనేది కేవలం అందమైన రూపాల్లోనే కాదు, ఇలాంటి ఊహించని రూపాల్లో కూడా ఉంటుందని ఈ భారీ సరీసృపాలు మనకు గుర్తుచేస్తున్నాయి. ప్రకృతిలో అమ్మ ప్రేమకు అడ్డుగోడలు లేవని చెప్పడానికి 'మొసలి మాతృత్వమే' ఒక గొప్ప ఉదాహరణ!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+