అసలు ఎక్స్ పెక్ట్ చేయని పర్సన్ నుంచి విజయ్ కు విషెస్
తమిళనాడు రాజకీయాల్లో నవశకం మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీ జోసెఫ్ విజయ్ పేరుతో ప్రమాణం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే అద్భుత విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విశేషం. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఏఐయూఎంఎల్ వంటి పార్టీల సహకారంతో ఇక్కడ ప్రభుత్వం కొలువుదీరింది.
ముఖ్యమంత్రిగా విజయ్ తో పాటు మొత్తం తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బస్సీ ఎన్ ఆనంద్- టీనగర్, ఆధవ్ అర్జున (విల్లివాక్కం), కేజీ అరుణ్ రాజ్ (తిరుచెంగోడు), కేఏ సెంగోట్టయ్యన్ (గోబిచెట్టిపాళ్యం), పీ వెంకటరమణన్ (మైలాపూర్), సీటీఆర్ నిర్మల్ కుమార్ (తిరుప్పరన్‌కుండ్రం), రాజ్‌మోహన్ (ఎగ్మోర్), టీకే ప్రభు (కారైకుడి), ఎస్ కీర్తన (శివకాశి) ఉన్నారు. వారికి ఈ సాయంత్రానికి శాఖలు కేటాయించవచ్చు.

కాగా- ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో చెన్నై జనసంద్రమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు పట్టణాల నుంచి విజయ్ అభిమానులు చెన్నైకి చేరుకున్నారు. దీంతో కోయంబేడు సహా ఇతర బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఈ తెల్లవారు జాము నుంచీ వారంతా చెన్నైకి చేరుకోవడం మొదలైంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే నెహ్రూ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యేల అనుచరులు, టీవీకే కార్యకర్తలు చెన్నై నిండిపోయింది.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ కు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే శుభాకాంక్షలు తెలియజేశారు. ఏకంగా ఓ దేశాధ్యక్షుడే విజయ్ కు విషెస్ చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన విజయ్‌ను అభినందించారు. శ్రీలంక- తమిళనాడు మధ్య భావసారూప్యం ఉండటం గమనార్హం. ఈ రెండింటి చరిత్ర, సంస్కృతి, వ్యాపార- వాణిజ్య కార్యకలాపాలు, తరతరాల ప్రజల బంధాలతో శ్రీలంక, తమిళనాడు అనుసంధానం కావడం తెలిసిందే.
Congratulations to Hon. C. Joseph Vijay on being sworn in as Chief Minister of Tamil Nadu.
— Anura Kumara Dissanayake (@anuradisanayake) May 10, 2026
Sri Lanka and Tamil Nadu are connected through history, culture, enterprise, and enduring people-to-people ties across generations. Our future holds immense economic promise and…
ఈ నేపథ్యంలో తమిళనాడుతో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ రకంగా గుర్తు చేసుకున్నారు దిశనాయకే. భారత్-శ్రీలంక బంధాలు బలపడుతున్నందున, అపారమైన ఆర్థిక అవకాశాలు, ప్రగతికి ఆస్కారం ఉందని అన్నారు. ఈ బలమైన భాగస్వామ్యంలో ఉమ్మడి సుసంపన్నత, అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి తాను ఆసక్తిగా ఉన్నానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి విజయ్, తమిళనాడు ప్రజలు విజయం సాధించాలని శ్రీలంక ప్రజలతో కలిసి ఆయన ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications