హైదరాబాద్‌ః బంగాళాఖాతంలో మూడు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం నిశ్చలంగా వుంది. ఈ అల్పపీడనం క్రమేణా బలహీనపడే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అల్పపీడనం ప్రభావం వల్ల గురువారం నాడు కూడా కోస్తా జిల్లాలలో ఉరుములతో కూడాని జల్లులు, కొన్ని చోట్ల భారీ వర్షాలుకురిశాయి. వచ్చే 24 గంటల్లో కోస్తాలో ఈదురు గాలులు, జల్లులు, భారీ వర్షాలుకురిసేఅవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
గురువారం కురిసిన భారీ వర్షాలతో నెల్లూరు జిల్లా పూర్తిగా దెబ్బతిన్నది. వరి, చేపల చెరువుల రైతులు భోరు మంటున్నారు. గత రెండేళ్ళు అనావృష్టి, ఈ ఏడాది అతివృష్టి మాకు శాపంగా పరిణుంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గూడూరు, నెల్లూరు డిజన్లు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి.












Click it and Unblock the Notifications
