కాబూల్‌ః యుద్ధం ఆరంభమైన తరువాత తాలిబన్లకు శుక్రవారం నాడుపెద్ద దెబ్బ తగిలింది. నార్తరన్ అలయెన్స్ దళాలు శుక్రవారం రాత్రి మజారే షరీఫ్ పట్టణాన్నిస్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించుకున్నాయి. తాలిబన్లకు కంచుకోట వంటి మజారే షరీఫ్ దిశగా నార్తరన్ అలయెన్స్ దళాలు కొద్ది రోజులుగా పురోగుస్తున్నాయి. శుక్రవారం నాడు కాబూల్, మజారే షరీఫ్ లపై అమెరికా దళాలు కనీనీ ఎరుగని రీతిలో బాంబింగ్ జరిపాయి.
ఈ దాడుల మధ్య నార్తరన్ అలయెన్స్ దళాలు మజారే షరీఫ్ పట్టణాన్నిస్వాధీనం చేసుకున్నట్లు భాస్తున్నారు. శుక్రవారం అమెరికా జరిపిన దాడిలో వందలాది మంది తాలిబన్లు మరణించిటనట్లు తెలుస్తున్నది. మరోవైపు రంజాన్ మాసంలోఅయినా యుద్ధానికి రామం ప్రకటించాల్సిందిగా శుక్రవారంబ్రిటన్ ప్రధాని టోని బ్లెయిర్ ను కలుసుకున్న ముషారఫ్‌కోరారు.












Click it and Unblock the Notifications
