ఉగ్రవాదుల దాడికి 13 మంది బలి
జమ్మూ: జమ్మూ దగ్గరలోని రాంబన్ వద్ద జమ్మూ కాశ్మీర్ హైవేపై ఉగ్రవాదులు భద్రతా సిబ్బంది వాహన శ్రేణిపై జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు. మరో 37 మంది గాయపడ్డారు. భద్రతా దళాల వాహనాలు ుత్రా బ్రిడ్జి వద్దకు రాగానే ముగ్గురు ఉగ్రవాదులు మొదట గ్రెనేడ్‌తో దాడి జరిపారని, ఆ తర్వాత గుండ్ల వర్షం కురిపించారని పోలీసులు చెప్పారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో జరిగింది.
ఈ దాడితో అప్రమత్తమైన జవాన్లు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారని, కొన్ని గంటల పాటు ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయని పోలీసులు చెప్పారు.
ఈ సంఘటనలో పది మంది జవాన్లు మరణించారు. మరో ముగ్గురు పౌరులుబలయ్యారు. కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మరణించినవారిలో 11 ఏళ్ల బాలుడు కూడా వున్నాడు. భద్రతా జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరో ఉగ్రవాది తప్పించుకుని పారిపోయాడు. రాంబన్ వద్ద జరిగిన ఈ సంఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
కాందహార్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. కాందహార్‌ను అప్పగించడానికి తాలిబాన్ సిద్ధంగా లేకపోవడంతో అమెరికా జెట్లు ఆదివారం కూడా దాడులు నిర్వహించాయి. ఈ ప్రాంతం ఇంకా తాలిబాన్ల ఆధీనంలోనే ఉన్నప్పటికీ పోరు మాత్రం జరగడం లేదని పష్తూ గిరిజన నాయకుడు హdుద్ కర్జాయ్ తెలిపారు. కాందహార్‌పై ఆధిపత్యాన్ని శాంతియుతంగా బదిలీ చేసేందుకు చర్చలు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. కుందుజ్ నగరం చుట్టూ నార్తర్న్ అలయెన్స్ బలగాలు మోహరించి వున్నాయి. అక్కడి తాలిబాన్ స్థావరాలపై అమెరికా బాంబర్లు దాడులు సాగించాయి.












Click it and Unblock the Notifications
