కుందుజ్‌ః ఐక్యరాజ్య సుతి పర్యవేక్షణలో కుందుజ్ పట్టణాన్ని అలయన్స్‌కు అప్పగించడానికి తాలిబన్లు సంసిద్ధత ప్రకటించారు. ఈ షయం పాకిస్తాన్ దినపత్రిక ఒకటి వెల్లడించింది. అమెరికా బాంబుల వర్షంలో ఇప్పటికే కుందుజ్‌లో కనీసం 1000 మంది మరణించారని తాలిబన్ల కమాండర్ ముల్లా ఫాజిల్‌ను ఉటంకిస్తూ డాన్ అనే పత్రిక వెల్లడించింది.
ఈ మారణకాండతో చలించిన తాలిబన్ల అగ్రనేతలు కుందుజ్‌నుఅప్పగించాలని నిర్ణయించారని ఇదే షయం ఐక్యరాజ్యసుతితో మాట్లాడాల్సిందిగా కుందుజ్ గవర్నర్‌ను కోరినట్టుగా ఆయన చెప్పారు. అయితే తమ యోధులు నార్తర్న్ అలయన్స్ ఎదుట లొంగిపోవడం మాత్ర కల్లా అని తాలిబన్ కమాండర్లు స్పష్టం చేశారు. అలయన్స్‌పై తమకు ఏమాత్రం శ్వాసం లేదని వారు చెప్పారు. ఐక్యరాజ్య సుతి వంటి తటస్థ సంస్థ జోక్యం చేసుకుంటే కందుజ్‌నుఅప్పగిస్తామని వారు చెప్పారు.
ఇదిలా వుండగా తాలిబన్ ప్రభుత్వాన్ని తాము గుర్తించడం లేదని ఇంతకాలం తాలిబన్లను గుర్తించిన ఏకైక దేశం పాకిస్తాన్ ప్రకటించింది. అదే సమయంలో రబ్బానీ ప్రభుత్వాన్ని కూడా తాము గుర్తించే సమస్యే లేదని పాకిస్తాన్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications
