లాడెన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
కాబూల్/లండన్/లాస్‌ఏంజిల్స్: కాందహార్‌కు తూర్పుగా 130 కిలోdుటర్ల దూంలోనిమరూఫ్ వద్ద అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ దాక్కుని ఉన్నట్లు నార్తర్న్ అలయెన్స్‌సీనియర్ అధికారి ఖనూని ఆదివారం కాబుల్‌లో చెప్పారు. లాడెన్‌కు అక్కడ శిక్షణా శిబిరాలు, భూగర్భంలో పటిష్టమైన బంకర్లు ఉన్నాయని ఆయన అన్నారు. లాడెన్ ఆచూకీ గురించి పాకిస్థాన్‌లోని తాలిబాన్ రాయబారి ముల్లా జయీఫ్ చేస్తున్న పొంతన లేని ప్రకటనలను ఆయన ఖండించారు.
లాడెన్ దాక్కుని ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతంలోబ్రిటన్, అమెరికా ప్రత్యేక దళాలు ఉచ్చు బిగించాయని లండన్ నుంచి వెలువడే సండే టైమ్స్ పత్రిక ఆదివారం వెల్లడించింది. లాడెన్ పాకిస్థాన్‌కు పారిపోకుండా వల పన్నినట్లు ఆ పత్రిక రాసింది.పర్వతాగ్ర భాగాల నుంచి ప్రత్యేక బలగాలు నిఘా వేసి ఉంచాయి. లాడెన్‌కు, ముల్లా ఉమర్‌కు తాము రాజకీయ ఆశ్రయం ఇవ్వలేదని, ఒక వేళ వారిద్దరు దేశంలో ప్రవేశిస్తే చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని పాకిస్థాన్ ప్రకటించింది.
కాందహార్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. కాందహార్‌ను అప్పగించడానికి తాలిబాన్ సిద్ధంగా లేకపోవడంతో అమెరికా జెట్లు ఆదివారం కూడా దాడులు నిర్వహించాయి. ఈ ప్రాంతం ఇంకా తాలిబాన్ల ఆధీనంలోనే ఉన్నప్పటికీ పోరు మాత్రం జరగడం లేదని పష్తూ గిరిజన నాయకుడు హdుద్ కర్జాయ్ తెలిపారు. కాందహార్‌పై ఆధిపత్యాన్ని శాంతియుతంగా బదిలీ చేసేందుకు చర్చలు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. కుందుజ్ నగరం చుట్టూ నార్తర్న్ అలయెన్స్ బలగాలు మోహరించి వున్నాయి. అక్కడి తాలిబాన్ స్థావరాలపై అమెరికా బాంబర్లు దాడులు సాగించాయి.












Click it and Unblock the Notifications
