వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమాజ భద్రతకేపెద్దపీట

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః తీవ్రవాదుల మానవహక్కుల కంటే తమ ప్రభుత్వం సమాజ భద్రతకే ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని వాజ్‌పేయి స్పష్టం చేశారు. కారణం ఏదైనా, పరిస్థితులు ఏవైనా తీవ్రవాదుల స్వేచ్ఛకన్నా సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణే ప్రధానమని ఆయన చెప్పారు.

ఇందిరాగాంధీ అంతర్జాతీయ శాంతి, అభివృద్ధి బహుమానాన్ని ఐక్యరాజ్య సుతి మానవహక్కుల కుషన్‌ చైర్మన్‌ మేరీ రాబిన్సన్‌కు ప్రదానం చేసిన సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

రాష్ట్రపతి భవన్‌లో సోమవారం నాడు ఏర్పాటైన సమావేశంలో రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ ఈ బహుమతిని రాబిన్సన్‌కుఅందజేశారు. తీవ్రవాదం పట్ల ఉపేక్షవహిస్తే ఏ సమాజంలోనైనా శాంతి, భద్రతలకు అభివృద్ధికి ముప్పుతప్పదని ప్రధాని చెప్పారు.సెప్టెంబర్‌ 11 తర్వాత తీవ్రవాదం ముప్పు తీవ్రత ప్రపంచదేశాలకు తెలిసివచ్చిందని ఆయన అన్నారు.అఎn్గానిస్తాన్‌లో సుస్థిర, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు టెర్రరిస్టులకు దీటైన సమాధానం కాగలదని ఆయనఅన్నారు.

ఇదిలా వుండగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 82వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగాసమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఢిల్లీలో శక్తిస్థల్‌వద్ద రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌, పలువురు అధికార ప్రముఖులు, సోనియాగాంధీ ఇతర కుటుంబ సభ్యులు ఇందిరకు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌తో సహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో జయంతి వేడుకలను ఘనంగా జరిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X