హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిపై అత్యంత భారీగా నిధులు వెచ్చించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీ మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాల నేతల శిక్షణ తరగతులముగింపుసందర్భంగా సోమవారం నాడు జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకాలను అటకెక్కిస్తున్నదనే ప్రతిపక్షాల ఆరోపణలు పూర్తి అవాస్తవమని ముఖ్యమంత్రి వరించారు. ప్రపంచంలో ఎక్కడాలేని ధంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేవాదుల ప్రాజెక్టును గడువు ప్రకారం పూర్తిచేస్తామని ఆయన తెలిపారు.
ప్రభుత్వ ధానాలు, కార్యక్రమాలపై సందేహాలు వుంటే వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపైనే వున్నదని ఆయన చెప్పారు. పార్టీకి ప్రజల్లోఅసలుసిసలైన ప్రతినిధులుగా వున్న కార్యకర్తలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఆరోగ్యంకోసం యోగ వంటి ప్రాక్టీస్ చేయాలని ఆయన హితువు చెప్పారు. నాలుగురోజుల పాటు జరిగిన ఈ శిక్షణ తరగతుల్లో 300 మంది ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
